పద్మావతీ శ్రీనివాసం💥🌹
పద్మావతీ శ్రీనివాసం💥🌹 🥀 అలిమేలుమంగమ్మకి అలసటగా అనిపించింది. మగతకళ్ళను నలుపుకోని, “ఇంకా రాడేం నా నామాలస్వామి” అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావటంతో, ఆమెకీ భక్తుల తాకిడి ఎక్కువగానేవుంది. నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏండుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది.ఎందుకే ఈ ఎదురుచూపులు. బద్దకంగా లేచి నాలుగు అడుగులు వేసి గుమ్మందాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండలవైపు చూసింది. ఏముంది... ఆయన జాడ లేదు సరికదా, ఇసుకేస్తే రాలనట్లు జనం కనిపించారు. ఇంకా వస్తున్నారు.. బస్సుల్లో, కార్లలో, కాలినడకన.. జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు “గోవిందా.. గోవిందా” అని అరిస్తే, అటువైపు వున్నాడేమో అని చూసింది. ఇంతలో మరోవైపు “ఏడుకొండలవాడా వేంకటరమణా...” అని మరో భక్తసమూహం కేకపెడితే, పోనీ అటువైపు కానీ వెళ్ళాడా అని చూసింది. ఎక్కడా ఆయన జాడే లేదు. అలిమేలుమంగమ్మ మరికాస్త పరికించి, తిరుమల కొండపైకి దృష్టి సారించింది.ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. “నారాయణా... ఇంకా సేవలు వున్నాయా? భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలేకానీ, మిమ్మల్