హాస్య బ్రహ్మ జంధ్యాల...... K. విశ్వనాథ్ ..గార్ల ...... శంకర శాస్త్రి గారు. . “ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని ఒకలా అంటాడు, ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్ధుష్టమైన నాదం ఉంది. ప్రయోగాల పేరిట ఆ అమృత తుల్యమైన సంగీతం అపభ్రంశము చేయకు దాసూ” శంకర శాస్త్రి, దాసు తో అన్న ఈ మాటలలో శంకర శాస్త్రి గుండెల్లో బాధ,సంగీతం మీద అతనికున్న అభిమానం , గౌరవం స్పష్టంగా అర్ధమవుతుంది. . శంకర శాస్త్రి గారి కూతురికి ఆయన బాల్య మిత్రుడు మాధవుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. అనేక సంబంధాలు శాస్తిగారికి నచ్చక పోవడం మాధవ్ కి విసుగు పుట్టిస్తుంటుంది. చివరికి ఒక స్కూల్ టీచర్ సంబంధం శాస్త్రి గారికి ఆమోద యోగ్యం గా అనిపిస్తుంది. కానీ పెళ్లి చూపులప్పుడు శారద (శాస్త్రి గారి అమ్మాయి) పాట పాడుతూ ఒక చోట శృతి తప్పుతుంది. శాస్త్రి గార్కి కోపం వస్తుంది, ఆ తరువాత పెళ్ళికొడుకు అమ్మాయిని సమర్ధించ బోయి తొందరపాటు తో కంగారులో శాస్త్రి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పోతాడు. సంగీత జ్ఙానము లేనివాడికి పిల్లనివ్వనంటూ, సంబంధం వద్దంటాడు శాస్త్రి గారు. . మాధవ్ మాటల్లో తన ఆవేదన, ఆక్రోశం, కోపం ...