నా కు ధర్మ రావు అంటే సాక్షాత్తు విశ్వనాథ వారే అని నమ్మకం.


విశ్వనాథ సత్యనారయణ గారి వెయ్యి పడగాలలో సంభాషణ...

నా కు ధర్మ రావు అంటే సాక్షాత్తు విశ్వనాథ వారే అని నమ్మకం.

.

ధర్మారావు - లోకములో దాంపత్యమాదర్శప్రాయముగా లేదనుట వాదన కాదు. మనము 

కొన్ని మామిడిపండ్లు పుచ్చువైనచో చక్కని మామిడిపండే యుండదని వాదించుట ఎట్లు ? లోకమునందేక పత్నీవ్రతులుండరాదా ?

.

రాధాపతి- లేరని నాయుద్దేశ్యము

ధర్మారావు - ఆ మాట తప్పు. నేనున్నాను

రాధాపతి - మీకు పరస్త్రీ మీద బుద్ధియే ప్రసరించదా ?

ధర్మారావు - మీరు సరిగా మాటాడవలయును. ' మనస్సే ప్రసరించదా ? ' అనవలయును. మనస్సు వేఱు, బుద్ధి వేఱు. మనస్సు చంచలమైనది. బుద్ధి సిద్ధాంతరూపమైనది. పరస్త్రీ సంగమము దోషము కాదను బుద్ధి నాకు లేదు. మనస్సు ప్రసరింపవచ్చును. దానిని ప్రయత్నముచే నియమించవలయును.

రాధాపతి - ఎందుకు నియమించవలయును? దాని యిష్టము వచ్చినట్లది పోయినచో తప్పేమి ?

ధర్మారావు - మనము విద్య కావలయునని చదువుకొనుచున్నాము. చదువుకొని కొంత నీతిగా ప్రవర్తించుచున్నాము. చదువుకొనకపోయిన నేమి, నీతిగా ప్రవర్తించకపోయిననేమి అనినచో సమాధానమేమియును లేదు. ...నాగరికత యనగా నియమములకొదిగియుండుట. మనము దగ్గర స్నేహితులతో నున్నప్పుడు యథేచ్ఛగా మాట్లాడుదుము. సభలో నున్నప్పుడొక నియమము నవలంబింతుము. దాని పేరే సభ్యత. వాఙ్నియమమెట్టిదో, నలుగురిలో మర్యాదా ప్రవర్తన యెట్టిదో, వానిననుసరించి సభలో పురుషునకు యోగ్యత యెట్లు కలుగునో, అట్లే మనస్సునకును నియమావలంబనము చేత ఉత్తమ యోగ్యత కలుగును. వాంఛ అణచనివానికి లఘుత, నియమించినవానికి గురుత.

రాధాపతి- నేను మీ సిద్ధాంతముల నొప్పుకొనను

ధర్మారావు - అయినచో వాదింతునననక్కఱ లేదు. [ వేయి పడగలు ]

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!