భామాకలాపం:---

భామాకలాపం:---

.

భామాకలాపం అన్న పేరు బాహ్యంగా శృంగార భూయిష్టంగా వున్నా, వేదాంతం పరమార్ధం మూలముగా కలిగినదీ కలాపం. భామాకలాపం వేదాంత ప్రబోధకై ఏర్పడిన గాధ. 

.

ఈ గాధ వెనుక ప్రత్యేక ధ్వని సిద్దాంతం తెలియబడుతూ వుంటుంది. సతి చరిత్ర నుడవ బడుతుంటే, పతి చరిత్ర వినబడుతూ వుంటుంది 

.

. "నయతి వృత్తం ఫలం ప్రపోతిచ ఇతి వినాయక" నాయకుడు ఫలమునకై ప్రయత్నించి తుదకు పొందువాడు. 

మువ్వురికి ఆది మూలమై శేషునిపై పవ్వళించి యున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇందలి నాయకుడు. నాయిక ఇట్టి నాయకుని రూపురేఖా విలాసములు భావ, రాగ, నాట్య గతులచే పర్ణించుచూ, శృంగారముగా కన్నుల నిండా జూచి బంగారు పూవుల పూజ సేయును. 

.

మాధవి పాత్ర ప్రత్యేకముగా మాధవుడు గనే గోచరం అగుచూ వుంటుంది. 

.

మాధవి అనంప్పుడు అది ఒక స్త్రీ వేషంలో వచ్చిన శ్రీకృష్న అంశ. సత్య భామ అంతరంగం అట్టడుగు వరకూ చూడగలిగి తెలిసి అందునా భగవత్ సాక్షాత్కారానికి ప్రతిబంధకాలయిన అహంకార మమకార గుణాలను వెలికి తీయుటకు తర్క రూపమయిన పరీక్ష బెట్టి అజ్ఞానం తనంతట తాను మాయం జేసుకునేటట్లు మార్గంచూపించుటకై, సాధనకై, 

భగవత్ భక్తికై యేర్పడిన మానవ రూపం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!