ముద్దుల నా యెంకి

ముద్దుల నా యెంకి

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

కూకుండ నీదురా కూసింత సేపు!

…………………..

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,

దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

యీడుండమంటాది ఇలు దూరిపోతాది,

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

మందో మాకో యెట్టి మరిగించినాదీ,

వల్లకుందామంటే పాణ మాగదురా!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||


Comments