రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి..

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి

అశోక వనంలో  హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:. 


ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా-

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే-

హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ-

ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్


ఆదర్శ  దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!