బాలు........రఘు ........సాగరసంగమం

బాలు........రఘు ........సాగరసంగమం

.

సాగరసంగమం, జూన్ 3, 1983 లో విడుదలైన తెలుగు చిత్రము..

విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. 

.

అందులో బాలు (కమల హసను ) అతని మిత్రుడు రఘు (శరత్ద్వా బాబు) ద్వారా తన భావాలు చక్కగా జంధ్యాలగారు తెలియచేస్తారు..

.

“మృతిలోన ముగిసినా చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము, 

ఎద వీడిపోనిదీ మమతాను రాగము.”

.

ఈ కొన్ని మాటలతోనే బాలు అనే ఒక తాగుబోతు నాట్య కళాకారుడు కి అతని ప్రాణమిత్రుడు, కవి ఐన రఘు ల బంధం తెలియ వస్తుంది. 

.

కవిగా రఘు ని గురించి చెప్పడానికి జంధ్యాల వ్రాసిన

.

“పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి,

రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్య లా మలిచేవాడు మనిషి.” అన్న మాటలు చాలు. శరత్ బాబు వ్యక్తిత్వాన్ని చెప్పడానికి జంధ్యాల వ్రాసిన ఈ మాటల కన్నా ఎక్కువుగా బహుశా విశ్వనాధ్ ఇంకేమీ కోరుకొని ఉండరు. 

ఆ సినిమాలోనే ఇంకోచోట, జయప్రద ఔదార్యాన్ని భరించలేక (తట్టుకోలేక) అనిపిస్తాడు “రోగం పేరుతో దానికి, దాని మొగుడి హోదాలో నాకు బానే మర్యాదలు జరుగుతున్నాయండి.” ఇక్కడ కూడా మధ్య తరగతి మనస్థత్వాన్ని ప్రతిఫలించేటట్టు ఉంటుంది, దానమైనా సరే తీసుకొనే ముందు నిష్టూర పడి చూపించడం అన్నమాట. జంధ్యాల మాటలు వ్రాయడంలో, కధను ముందుకు తీసుకెళ్లడమే కాదు ఆ పాత్రల స్థితి గతులకి స్వభావానికి దగ్గరగా ఉండే మాటలు అల్లుతాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!