Posts

జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది

Image
శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట! .  జగమంతకుటుంబం  పాట  పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది  సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే  చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై  మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో  పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల  నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ  ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం  కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని  కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత// శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .  1+1 × 1-1 = 1 రెండు ఒకటి ( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1 పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 × 1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా...

అద్వైతం!

Image
అద్వైతం! వినాయకుడి వివాహఘట్టాన్నిపరిశీలిస్తే ముందుగా లోకాన్ని చుట్టి వచ్చిన వానికే వివాహం జరిపిస్తానని శివుడు .  కుమారస్వామికి , వినాయకునికి పరీక్ష పెడతాడు .  కుమారస్వామి వెంటనే బయలుదేరుతాడు .  వినాయకుడు అలోచించి సృష్టిలో ఉన్నది ప్రకృతి పురుషులైన తన తల్లిదండ్రులు శివపార్వతులేనని, వారి చుట్టూ తిరిగితే లోకాన్ని చుట్టివచ్చినట్టేనని  అద్వైత దృష్టితో వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు .  ఆ దృష్టి ఉండడం వల్లే వినాయకుడు కాలు కదపకుండానే కార్యం సాధించాడు .  .  అద్వైత దృష్టి మనకు తెలియకుండానే అప్పుడప్పుడు ముఖ్యంగా పర్వదినాల్లో కలుగుతుంది.పండగలప్పుడు బంధువులు స్నేహితులు అందరూ ఏకం అవుతారు . దానధర్మాలు చేస్తారు . సాంఘిక చారిత్రక ఆర్ధిక వ్యత్యాసాలకు అతీతంగా అందరూ ఒకటనే భావన కలుగుతుంది . మర్నాడు మళ్ళీ మామూలే .  పండగ రోజు సామూహికంగా పొందిన అద్వైతానుభూతిని వ్యక్తిగతంగా పొందగలిగితే ప్రతిరోజూ పండగే . ఇందుకోసం పైసా ఖర్చుపెట్టక్కర్లేదు . కాలు కదపక్కర్లేదు . వినాయకుడిలా సూక్ష్మంలోనే మోక్షం పొందవచ్చు .

లక్ష్మీ హృదయ వాసా చిద్విలాసా ఏడుకొండలవాసా వేంకటెశా నమో నమః

Image
లక్ష్మీ హృదయ వాసా చిద్విలాసా  ఏడుకొండలవాసా వేంకటెశా నమో నమః

నేనెవరు?

Image
నేనెవరు? . ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన కథ అందరికీ తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ,ఒక అన్వేషణగా సాగి ,పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది . మానవుని కథాఅంతే. ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయినట్టు,లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణే ఆధ్యాత్మిక సాధన. మానవుని చరిత్ర.  చిన్నతనంలో తరతమ బేధాలు తెలియవు. ఆ అమాయకత్వం అమూల్యమైనది. పెద్దయ్యాక ‘సామజిక స్పృహ’ ఏర్పడుతుంది. అంతరాలు,అభిప్రాయాలు ఏర్పడి నామరూపాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ సామాజిక స్పృహ కొన్నాళ్ళకు నిస్పృహ కలిగిస్తుంది.దానికి తోడు చేసే పనే కాదు,తీరిక సమయంలో చేసే కాలక్షేపం కూడా యాంత్రికం అయిపోవడం. దీనివల్ల అర్థాన్ని గడిస్తున్నా, బ్రతుకు అర్ధశూన్యంగానే వుందే అనిపిస్తోంది. ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది.

అహం బ్రహ్మాస్మి’!

Image
అహం బ్రహ్మాస్మి’! ఈ వేదాంత మహావాక్యంలోని బ్రహ్మ, పరబ్రహ్మ.  శివుడికున్న మూడోనేత్రం(జ్ఞాననేత్రం) తనకూ వుంది కాబట్టి మానవుడు తాను పరబ్రహ్మ స్వరూపుణ్నని గుర్తించగలడు. .  .  శివుడు ఆత్మ స్వరూపుడు . అందువల్ల శివుడి లక్షణాలనే ఆత్మ లక్షణాలుగా గుర్తించవచ్చు. .  శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. .  శివుడికి స్వపరబేధం లేదు. ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు .రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే, కోరింది ఇస్తాడు . .  శివుడు అమృతాన్ని విషాన్ని వేరుగా చూడడు . సత్ప్రయోజనం కోసం అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. .  ఈశ్వరుడు సంసారాన్ని, సన్యాసాన్ని విడగొట్టడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చి బూడిద చేసినవాడే ,పార్వతిని వివాహమాడి సంసారి అయ్యాడు. మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు.  ఈ భిన్న తత్వాల వెనక ఉన్న ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం .  .  ఈ తత్వాన్నే సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు, ‘సంసార సాగరం నాదే ,సన్యాసం శూన్యం నావేలే’ అని తన ‘జగమంత కుటుంబం’పాటలో వ్యక్తం చేసారు శివ...

ఆశ/నిరాశ.!

Image
ఆశ/నిరాశ.! .  ప్రతివారు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు. పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం,  బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు.  అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి,  ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు క్యూ కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్యపోనక్కర లేదు.ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి. వరకట్నమెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం. దారి తప్పేం. ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలి...

భోగిమంటల సందడి భోగభాగ్యాల సవ్వడి !

Image
మంచు కురిసే శీతాకాలం ... ఉషోదయపు వెలుగులో... తెలుగువారి వాకిట్లో ... తళుక్కుమంటున్న  భోగిమంటల సందడి భోగభాగ్యాల సవ్వడి ! సంక్రాంతి లక్ష్మి మనింటికి వస్త్థూన్న ..శుభ సమయం. మీకు మీ (మన) కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు