అద్వైతం!

అద్వైతం!

వినాయకుడి వివాహఘట్టాన్నిపరిశీలిస్తే ముందుగా లోకాన్ని చుట్టి వచ్చిన వానికే వివాహం జరిపిస్తానని శివుడు . 

కుమారస్వామికి , వినాయకునికి పరీక్ష పెడతాడు . 

కుమారస్వామి వెంటనే బయలుదేరుతాడు . 

వినాయకుడు అలోచించి సృష్టిలో ఉన్నది ప్రకృతి పురుషులైన తన తల్లిదండ్రులు శివపార్వతులేనని, వారి చుట్టూ తిరిగితే లోకాన్ని చుట్టివచ్చినట్టేనని 

అద్వైత దృష్టితో వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు . 

ఆ దృష్టి ఉండడం వల్లే వినాయకుడు కాలు కదపకుండానే కార్యం సాధించాడు . 

అద్వైత దృష్టి మనకు తెలియకుండానే అప్పుడప్పుడు ముఖ్యంగా పర్వదినాల్లో కలుగుతుంది.పండగలప్పుడు బంధువులు స్నేహితులు అందరూ ఏకం అవుతారు . దానధర్మాలు చేస్తారు .

సాంఘిక చారిత్రక ఆర్ధిక వ్యత్యాసాలకు అతీతంగా అందరూ ఒకటనే భావన కలుగుతుంది . మర్నాడు మళ్ళీ మామూలే . 

పండగ రోజు సామూహికంగా పొందిన అద్వైతానుభూతిని వ్యక్తిగతంగా పొందగలిగితే ప్రతిరోజూ పండగే . ఇందుకోసం పైసా ఖర్చుపెట్టక్కర్లేదు . కాలు కదపక్కర్లేదు . వినాయకుడిలా సూక్ష్మంలోనే మోక్షం పొందవచ్చు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!