ఏనాటి మాటో !

ఏనాటి మాటో !

.

శ్రీ శ్రీ గారొకసారి ఆరు బయట తుండు గుడ్డ కట్టుకొని స్నానం చేస్తున్నారట. 

శిష్య వాత్సల్యము చేత శ్రీ శ్రీ ని చూడటానికొచ్చిన కవి సామ్రాట్ విశ్వనాధ వారు ఆ దృశ్యాన్ని చూసారు.

స్నానం చేస్తున్నది మహా కవి. 

చూసినది కవి సామ్రాట్ ... 

ఇంకేముంది ... 

విశ్వనాధ వారు "మహాకవి ఆరు బయట నీల్లాడె" అని ఎత్తి పొడిచారు . 

మరి శ్రీ శ్రీ ఊరుకుంటారా ? 

తక్షణం "కవి సమ్రాట్టు గనుచుండ మహా కవి నీల్లాడే " అని ప్రత్యుత్తరమిచ్చారట! 

ఇక్కడ గమనించ వలసినదేమిటంటే నీల్లాడే అని విశ్వనాధ వారు "శ్రీ శ్రీ ప్రసవిస్తున్నాడు" అనే అర్ధముతో చెబితే అదే అర్ధం వచ్చేలా "కవి సమ్రాట్టు కనుచుండే " అని రిటార్డు నిచ్చారు ! 

అదీ సంగతి! విద్వత్తు ఏ ఒక్కరి సొత్తు కాదన్నది గ్రహించాలిసిన పరమార్ధము కాదా! 

అన్యాపదేశంగా శ్రీ శ్రీ చెప్పింది ఇదే

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!