ఎదురు చూపులు!

ఎదురు చూపులు!

కమ్మగా పాడే కోయిలనడిగాను, 

నీ తీయని మాటలతో నను మురిపించేది ఎప్పుడని ... 

చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,

నీ చల్లని చూపుతో నను తాకేది ఎప్పుడని.. 

వర్షించే మేఘాన్ని అడిగాను , 

నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎప్పుడని ... 

హాయిని పంచే వెన్నెలని అడిగాను , 

ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎప్పుడని ... 

పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను , 

నీ పరుగు నా కోసమేనా ? అని ...

నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని , 

నా దరి చేరమని ..... నను బ్రతికించమని 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!