‘బెంగుళూరు నాగరత్నమ్మ...

‘బెంగుళూరు నాగరత్నమ్మ...త్యాగరాజ ఆరాధన – పార్టీ రాజకీయాలు.!

.

ఎందరో మహానుభావులు, అందరికి వందనములు’ అనే త్యాగరాజస్వామి కీర్తనను

వినని తెలుగువారు అరుదే. తెలుగువారని ఎందుకు, కర్ణాటక సంగీతములో ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పంచరత్న కృతి పరిచితమే. 

.

అట్టి మహానుభావులలో ఒక స్త్రీ, సుమారు 125 సంవత్సరాలకు ముందు దక్షిణ భారత దేశములో పుట్టింది. ఆమెయే విద్యాసుందరి నాగరత్నమ్మ. ఈమె శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది. కన్నడ సీమలో జన్మించి, తెలుగు దేశమంతా సంచరించి, తమిళ భూమిలో అంతమయింది. ఆమె మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక పుటను వ్రాసింది.

.

త్యాగరాజ ఆరాధన – పార్టీ రాజకీయాలు.!

త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. 

తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు 

తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది. ఉమయాళపురం సుందర, కృష్ణ భాగవతులు, తిల్లైస్థానం రామ అయ్యంగార్, వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్. వీళ్ళందరు వారివారి ఊళ్ళల్లో ఈ శ్రాద్ధాన్ని చేసేవారు. రామ అయ్యంగార్ తరువాత వారి శిష్యులైన నరసింహ, పంచూ భాగవతర్ సోదరులు ఈ శ్రాద్ధాన్ని తిరువైయ్యారులో సంగీతముతో సహా చేసేవారు. 

అన్నదమ్ములలో కలిగిన విరసము వల్ల అవి రెండు పార్టీలుగా మారాయి. 

పెరియ కక్షి (పెద్ద పార్టీ) నరసింహ భాగవతరుది, చిన్న కక్షి (చిన్న పార్టీ) పంచూ భాగవతరుది.

.

బెంగళూర్నాగరత్నమ్మ త్యాగరాజుల ఆలయాన్ని కట్టిన తరువాత,

ఆమె కూడ ఈ వర్ధంతిని చేసేది. అనగా మూడు పార్టీలు చేసేవి 

ఈ తద్దినాలను. ఈ మూడు పార్టీలు చివరకు 1940నుండి 

"శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ "ఆధ్వర్యాన ఒకే విధమైన పద్ధతిని అనుసరించారు. 

దీని ఫలితముగా చిన్న పార్టీకి మొదట పూజ చేసే హక్కు, తరువాత నాగరత్నమ్మకు, చివర సభయొక్క సభ్యులకు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!