మీ గుండె మీ ఇష్టం.

మీ గుండె మీ ఇష్టం.

.

నారాయణ హృదయాలయ , బెంగళూరు లో హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దేవి శెట్టి గారు గుండె ఆరోగ్యానికి ఇచ్చిన సలహాలు....

ప్రశ్న 1 . గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 

జవాబు : 1> తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె ళూ

..............2> వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం 

.............3> ధూమ పానం మానడం 

..............4> బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం 

..............5> బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం 

.

ప్రశ్న 2. కొవ్వును కండగా మార్చుకొగలమా ? 

జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు . కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం . కొవ్వు కండగా మారదు 

.

ప్రశ్న 3 : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? 

జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి .

.

ప్రశ్న 4 : గుండె పోటు వంశ పారం పర్యమా ? 

జవాబు : అవును 

.

ప్రశ్న 5 : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది > ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ ) 

జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి . 

.

ప్రశ్న6: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ? 

జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు 

.

ప్రశ్న 7: మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు ? 

జవాబు : మదర్ తెరెసా !

.

ప్రశ్న 8: లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోతూ వచ్చే అవకాశం ఉందా ?

జవాబు : చాలా తక్కువ 

.

ప్రశ్న 9 : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? ( నా వయసు 22 ) . 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా ?

జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది 

.

ప్రశ్న 10 : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?

జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు . ఆఅహారమ్ జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి . 

.

ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?

జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా 

.

ప్రశ్న 12: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ? చెడ్డ ఆహారం ఏది ?

జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి 

.

ప్రశ్న 13: ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె , ఆలివ్ ఆయిల్ ?

జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే 

.

ప్రశ్న 14: ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?

జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి 

.

ప్రశ్న 15: గుండె పోతూ వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?

జవాబు : గుండె పోతూ వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి . ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ . 

.

ప్రశ్న : 16 : గేస్త్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 

జవాబు : ఈ సి జీ చూస్తే గానీ చెప్పలేము 

.

ప్రశ్న 17: యువకులలో గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి ) 

జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .

.

ప్రశ్న 18 : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ? 

జవాబు : ఉంటారు 

.

ప్రశ్న 19 : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు . వాస్తవమా ? 

జవాబు : వాస్తవమే ! దగ్గర సంబంధాల వలన కంజెనితల్ ఎబనార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు . మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు పిల్లాడు పుట్టాక పోవచ్చు ( అందరూ నవ్వేరేమో ! ) 

.

ప్రశ్న 20 : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపం . నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం . ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?

జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది ఇటువంటి అసంబద్ధ జీవిత విధానానం నుండి . కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి . 

.

ప్రశ్న 21: ఎన్టీ హైపర్ టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ ) 

జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్ 

.

ప్రశ్న 22 : కాఫీ / టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 

జవాబు : లేదు 

.

ప్రశ్న 23 : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?

జవాబు : లేదు 

.

ప్రశ్న 24 : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి ? 

జవాబు : వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా 

.

ప్రశ్న 25 : భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా !

జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది ( అనుకూలత ఉంటుంది ) దురదృష్ట వశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది .

ప్రశ్న 26 : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ? 

జవాబు : నో 

.

ప్రశ్న 27 : గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా ? ( మాకు ఈ మెయిల్స్ లో సాధ్యం అని చెప్పారు ) 

జవాబు : వెల్లకిలా పడుకోవాలి . నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి . అంబులెన్స్ రావడం త్వరగా జరగదు . 

.

ప్రశ్న 28 : లో వైట్ బ్లడ్ సెల్స్ ( తక్కువ తెల్ల రక్త కణాలు ) హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా ? 

జవాబు : కావు . కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది 

.

ప్రశ్న 29 : మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సేర్సైజ్ చెయ్యడానికి టైం ఉండదు . ఇంట్లో నడవడం , మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా 

జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీలోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు .

.

ప్రశ్న 30 : షుగరుకూ , గుండె జబ్బులకూ సంబధం ఉందా ? 

జవాబు : ఉంది . షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ .

.

ప్రశ్న 31 : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? 

జవాబు : ఆహారం , ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బి పీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం 

.

ప్రశ్న 32 : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి , డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ? 

జవాబు : నో 

.

ప్రశ్న 33 ; ఎన్టీ హైపర్ తెన్సివ్ డ్రగ్స్ ఏమిటి ?

జవాబు : కొన్ని వందలు ఉన్నాయి . మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు . కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం ( నడక ) . ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం . 

.

ప్రశ్న 34 : డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?

జవాబు : నో 

.

ప్రశ్న 35 : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది 

.

ఆఖరు ప్రశ్న : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 

జవాబు :

ఆరోగ్య వంత మైన ఆహారం తినండి 

ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి 

జంక్ ఫుడ్ తినకండి 

స్మోకింగ్ మానండి 

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి

( రికమెందేడ్ )


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!