గుంపులో గోవింద !

అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద !

.

ఏదో అందరూ ఇండియాలో ఉండి , ఒకరు అమెరికా వెళ్తే గొప్పకానీ ,

.

అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద ! 

.

అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యధాశక్తిగా గొప్పలు చెప్పుకోవడం..

.

" మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం , తెల్లారేసరికి దూదికుప్పల్లా మొకాటివరకు మంచు , ఎంతబాగుంటుందో చూడ్డానికి " అని ఒకరంటే " నిజమే పాపం అదో పీడాకారం , తెల్లారి లేస్తూనే పారలు , పలుగులు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలిట పాపం , వెధవ చాకిరీ , మా అబ్బాయి ఉండేది సీ కోస్ట్ , లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతవరణం " అని మరొకరి సానుభూతి .

.

"కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయాగరా చూశాం ఎంత బాగుందో " అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే..

.

" భలెవారేలెండి ! అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపునుండి చూడాలి , మొన్న మేము వెళ్ళొచ్చాము , ఈ సారి మీరూ వెళ్ళిరండి " అంటూ మరొక ఇల్లాలి సలహా.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!