దామెర్ల వారి ఊరుబావి. ...


దామెర్ల వారి ఊరుబావి. ... 

ఇంకిపోయి, పూడుకుపోయిన ఊరుబావి. 

పేరుకేమిగిలింది. 

అనవసరపు మాటలలో, అయోమయపు కవితలలో, 

అర్థంకాని కథల్లో...... !

కాలం గడుస్తున్న కొద్దీ బావి చుట్టూ ఎన్నో జరిగాయి. 

బావి వైపువాళ్ళు బావికి గట్టు కట్టి, గోడ కట్టి బాగుచేయించిన కాలమూ ఉంది. 

తమ గుత్తగా బావిదగ్గరకు రావడానికి నియమాలు పెట్టి కట్టడి చేసిన రోజులూ ఉన్నాయి. తరాల అంతరాలకు ఆ బావి ప్రత్యక్ష సాక్షి.

కాలంతో ఆ గొడవలూ కొట్లాటలూ వస్తూనే ఉన్నాయి సర్దుకుంటూనే ఉన్నాయి. 

మనుషుల మనస్థత్వాల వల్ల ఈ హెచ్చుతగ్గులస్థాయి మారుతున్నా ఒక విషయం అందరిలో బలంగా ఉండేది. 

ఆ బావి ఆ ఊరి అవసరం. దానిని కాపాడుకోవాలి. అందరికీ అందాలి.

ఆపై చేసే ఆలోచనలదగ్గరే అనేకమైన తేడాలు వచ్చాయి. హక్కులు, బాధ్యతలు, కట్టుబాట్లు ఏనాటికీ అందరికీ నచ్చేవిగా ఉండలేవు

. ఊళ్ళోవాళ్ళో, పొరుగూరివారో, బాటసారులో… బావి దగ్గర నీళ్ళు త్రాగినవారూ ఉన్నారు. బావిలో చెత్తా చెదారం పడేసిన ప్రబుద్ధులూ ఉన్నారు. 

ఎప్పటి కప్పుడు క్రొత్త నీరు ఊరే బావి అది. 

అప్పుడప్పుడు బాగుచేసుకుంటుండాలి అంతే.

Comments

  1. ఇవి నేను వ్రాసిన ఊరుబావి కథలోని వాక్యాలు ...
    http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/urubavi---bhairavabhatla-vijayaditya

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!