సౌందర్యం.!

సౌందర్యం.!

.

" లోకంలో ఉన్న సౌందర్యం ఒక్కోసారి ఒక్కోలా హఠాత్తుగా దర్శనం ఇచ్చేస్తే ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందడం అనేది ఒక్కోసారి చాలా ఇబ్బందైన పని అనే అనిపిస్తుంది,

ఆ సౌందర్యాన్ని చూసిన ఆనందం వల్ల కలిగిన తన్మయత్వపు స్థితిలో ఉన్నప్పుడు ఒక అందాన్ని మించి మరో అందం కంటిముందు కనిపించి కళ్ళెదుటే తిరుగాడుతూ ఉంటే పొందే బాధ స్వర్గమో,నరకమో ఖచ్చితంగా తెల్పలేని భావస్థితిలా తోస్తుంది "

.

ఇంత స్థితి గురించి నేనెందుకు వర్ణించి చెప్తున్నాను అంటే , ఈరోజు జరిగిన ఒక సంఘటన గురించి ముందుగా వివరించాలి....

.

మా కాలేజులో అమ్మాయిలు ఎప్పుడు కూడబలుక్కుని ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, ఈరోజు ప్రతీ అమ్మాయి " లంగా ఓణీలు " కట్టుకుని చక్కగా మన తెలుగు వస్త్రధారణలో తయారయ్యి కాలేజుకి విచ్చేసి మాకు కనువిందు చేసేసారు ఒక్కసారిగా...!!!

ఉదయం లేచి ఏ ఏ సౌందర్యాలును ఈరోజు ఆస్వాదిస్తానా అని అనుకునే నాకు ఇంత ఊహించని సౌందర్యాలు ఎదురయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుబోక అచేతనావస్థకు గురి అయిన వ్యక్తిలా అలా వాళ్ళని చూస్తూ ఉండిపోయానంతే .......!!!

.

" ఈలోకంలో ఎన్ని గొప్ప సౌందర్యాలు ఉన్నాయి?

వెతికే ఓపికా,ఆస్వాదించి స్పందించే మనసూ ఉండాలే కాని ఈ లోకంలో ప్రతీదీ సౌందర్యమే..

సౌందర్యం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ లోకంలో ముఖ్యంగా కనపడేవి రెండే సౌందర్యాలు.

1. ప్రకృతి తాలూకు సౌందర్యం

2. స్త్రీత్వం తాలూకు సౌందర్యం.

నిజమే .....!!!!!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!