కొత్త చదువులు.!

కొత్త చదువులు.!

.

అదేమిటో మా తాత తిన్న నేతి వాసన 

నా ముతి లోనుండి వస్తుందట... 

విద్యాధికులందరినీ చూడబోతే

భారతీయులలాగే కనబడుతుంటారట .....

.

స్మశానంలో తిరిగి తిరిగి.. 

శివుడి కొరకు వెతికినట్టు 

విద్య పుట్టిన దేశం లో 

మన విలువలు ,వెలుగులు వెతకాలట... 

.

బోధాయనుడెవ్వడో 

ఎవడికి కావాలట... 

మార్కులొచ్చే "పైథాగరస్" 

వస్తే సరిపోతుందట .....

కణ్వుడు,శుశ్రుతుడు , భరద్వాజ,

బ్రహ్మగుప్త,మిహిరుడు , ఆర్యభట్ట.. .. 

విద్వాంసుల విజ్ఞాన శాస్తవతంసుల 

ఆత్మలన్నీ కలిసి ఇప్పుడు 

మళ్లీ మళ్ళి ఆత్మహత్య చేసుకోక తప్పదంట .... 

.

విద్యంటే పిండి మర -తిప్పాలట గిర గిరా 

బట్టి బాగా పట్టగల- దేశాన్ని తిట్టగల 

బొమ్మలను వెలికి తెచ్చి - పత్రాలను చేతికిచ్చి 

కొత్తవాణ్ణి మరను వేయ 

ఊరంతా వెతకాలట ప్రచారాలు చేయాలట..

.

అదేమిటో మా తాత తిన్న నేతి వాసన 

నా మోతి లోనుండి వస్తుందట...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!