వెర్రి తలల తె(లు)గులు!


వెర్రి తలల తె(లు)గులు!

.

'బెంకట్రావ్! బెంకట్రావ్! భై ఆర్యూ బాండరింగ్ ఇన్‌ ద బరండా"?

.

"ఢిల్లీ" ని దిల్లీ అంటున్నారు, "కాశ్మీర్" ని కశ్మీర్ అంటున్నారు. వాళ్లు అలాగే అంటారు అంటున్నారు!

సరే. మరి "పశ్చిమ్‌ బంగ" యేమిటి?

అనేక భారతీయ భాషల్లో, అంగ, వంగ, కళింగ......రాజ్యాలున్నాయి. అందులో ఈ "వంగ" ఒకటి. అక్కడ వాళ్లు మాట్లాడే భాషని వాళ్లు "బంగ్లా" అంటారు. అందుకే, తూర్పు బెంగాలు వాళ్లు వాళ్ల దేశం పేరు "బంగ్లాదేశ్" అని పెట్టుకున్నారు. మరి మనదేశం లో వున్నది "పశ్చిమ బంగ్లా" యే అవుతుంది కదా?

ఇంగ్లీషువాళ్లు, "బెంగాల్" అన్నారు. "బెంగాలు విభజన" ఓ చారిత్రక సత్యం. బెంగాలు ని తెలుగులోకి అనువదించుకుంటే, "బంగాళ" అయ్యింది. ఇంగ్లీషువాడు "బే ఆఫ్ బెంగాల్" అంటే అది "బంగాళాఖాతం" అయ్యింది! ఇప్పుడది "బంగాఖాతం" కాదు (అయిపోదు) కదా?

వాళ్లు "వ" అనే అక్షరాన్ని "బ" అని పలుకుతారు. "రవీంద్ర" ని "రబీంద్ర" అంటారు. అవనీ ని అబనీ అంటారు. అమితవ్ ని అమితబ్ అంటారు. (అలా వచ్చిందే అమితబ్.....అమితాబ్ బచ్చన్‌!)

హిందీ లాంటి భాషల్లో, పలుకుబడిని బట్టి, పదం లోని అక్షరాల సంఖ్యని బట్టి, రెండూ, మూడూ, నాలుగూ అక్షరాలని తేల్చి (పొల్లుతో) పలుకుతారు. తెలుగులో పశ్చిమ్‌ లేదు. పశ్చిమ అనాలి.

యెవరో ఓ వంగీయుడు, 'బెంకట్రావ్! బెంకట్రావ్! భై ఆర్యూ బాండరింగ్ ఇన్‌ ద బరండా"? అన్నాడని, మన "వెంకట్రావు"లందరినీ, "బెంకట్రావ్" లని చేసేద్దామా?

శంకరనారాయణే ఆలోచించాలేమో?

(మా చిన్నప్పుడు శంకర నారాయణ డిక్షనరీ యే ప్రామాణికం).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!