తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

.

అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ తన శతకాల్లో అక్కడక్కడ

హాస్యాన్ని మెరిపించారు.

.

“దయ్యాలను చూపిస్తా

నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా

కయ్యో తన కూతుళ్లను

చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ”

.

ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ

‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది.

.

“ఎప్పుడు పడితే అప్పుడు

కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్

చొప్పడిన యూరకుండుము

చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ”

.

శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ.

.

“ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము

రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ”

ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!