కోయవారు !

కోయవారు !

.

.కోయ (Koya) అనేది ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఒక తెగ.

. వీరు ఇంద్రావటి, గోదావరి, శబరి, సీలేరు నదుల ప్రాంతాల్లోను మరియు బస్తర్, కొరాపూట్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. 

దేశభక్తి, ఐక్యత ఎక్కువగా ఉన్న వీరు 1880 లో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. భారతీయ స్వాతంత్ర్య పోరాట చరిత్ర ప్రకారం దీనినే కోయ తిరుగుబాటు అని అంటారు. కోయవారు మాట్లాడే భాష కోయి - తెలుగు భాషకు పోలికగా ఉంటుంది.

కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి మరియు రేగు పళ్ళను సృష్టించాడు. 18 వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులు (Untouchables)గా పరిగణించేవారు. తరువాత కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారి కిచ్చారు. 

.

కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి మరియు రేగు పళ్ళను సృష్టించాడు. 18 వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులు (Untouchables)గా పరిగణించేవారు. తరువాత కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారి కిచ్చారు. ఆప్పుడు ఆ డివిజన్ లో 225 కోయ గ్రామాలుండేవి.

కోయవారిలో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ మరియు అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోనే ఆహారపు అలవాట్లు ఒకలా ఉండవు. లింగదారి కోయలు గొడ్డు మాంసం (Beef) తినరు - ఇతరులతో భోజనం చేయరు. కులాంతర వివాహాల వచ్చే నష్టాలను నివారించడానికి కొన్ని పూజలు చేస్తారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కూడా కొన్ని పూజలు చేస్తారు. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు. అరిటి కోయలు పాటలు పాడుతారు, వంశ వృక్షాలను వివరిస్తారు.

జీవిత భాగస్వామిని చర్చలద్వారా ఎన్నుకొంటారు. ఒక్కొక్కసారి అమ్మాయి (Bride) అబ్బాయి (Bride groom) ఇద్దరూ కలిసి లేచిపోవడం ఆ తర్వాత స్త్రీ పునరుత్పత్తి (Fertility)ని ప్రతిబంబించేలా అమ్మాయి మీద నీరు పోయడం వంటి నాటకోత్తర (dramatic) సన్నివేశాలు జరుగుతాయి. వివాహ వేడుకను రెండు గ్రామస్తులు కలిసి మూడు రోజులు జరుపుకొంటారు. ప్రతి వ్యక్తి ధాన్యాన్ని(grains) , మధ్యాన్ని (Alcohol) పెళ్ళికూతురి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తాటి కల్లు (Palmyra toddy) ఎక్కువగా దొరికే ఎండాకాలంలో వివాహాలు జరుగుతాయి.

దహన సంస్కారాలు (Cremations) విభిన్నంగా జరుగుతాయి. శవాన్ని మంచం మీద పరుండబెట్టి, ఆ శవం ప్రక్కన ధాన్యం, కల్లు, క్రొత్త బట్టలు, డబ్బులు మరియు ఆవు తోక పెట్టి అందరూ మోసుకెళ్ళి శవాన్ని తీసుకెళ్ళతారు. గర్భిణీ స్త్రీ మరియు ఐదు నెలల లోపు పిల్లల శవాలను పాతిబెడతారు. 11వ రోజున 'దినం' పాటిస్తారు. ఆ సమయాల్లో ఆత్మ మరలా వచ్చి ఆనకుండ అనే మట్టికుండలో నివసిస్తుందని నమ్ముతారు.

.

కోయభాషపై కొన్నిమాటలు!

సవరలు, కోయలు మొదలయిన మోటు జనులు సంఘములలో అందరూ ఒక్క విధమయిన భాషే మాట్లాడుతారు; శిష్ట భాష అనీ గ్రామ్య భాష అనీ తారతమ్యము ఉండదు. నాగరికులతో సంబంధముగలవారు కొందరు నాగరికుల మాటలు కొన్ని తమ భాషలో కలిపి వాడుకొంటారు. వాటి ఉచ్చారణ సరిగా ఉండకపోయినా, అందరూ వాటిని మెచ్చుకొంటారు. గాని నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు. వర్ణవ్యవస్థ యేర్పడ్డ సంఘములలో భాషావ్యవస్థ కూడా ఏర్పడుతుంది. మాట్లాడేవారి ప్రతిష్ఠ, గౌరవము, కులీనత్వము మొదలయినవాటిని బట్టి వారి భాష “శిష్ట భాష” అని మెప్పుపొందుతుంది; అట్టి వారితో సహవాసము చేత, ఇతర జాతుల వారికి కూడా శిష్ట భాష అలవడుతుంది. క్రమక్రమముగా ఈ “శిష్టభాష” సంఘములో వ్యాపిస్తుంది. “దేశభాష” అనేది ఈలాగుననే ఏర్పడుతుంది.-గిడుగు రామమూర్తి పంతులు

వెయ్యేళ్ళ క్రితమే ‘స్థిరపడ్డ’ తెలుగును ‘కోయ, సవర, చచ్చట’ భాషల్లాంటి కేవల వ్యవహార దశకూ ఆటవిక స్థితికి దించరాదు-గ్రాంథిక భాషావాదులు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!