Skip to main content
సంక్రాంతి పండుగ..!
సంక్రాంతి పండుగ..!
సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతి
పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి
గజ గజా వణికిస్తూ వుంటుంది. మొదటి రోజు "భోగి" ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో
"గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి
"సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని
"కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు.
బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి,
పేరంటం చేస్తారు. రెండవ రోజు "సంక్రాంతి" ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున
స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. బెల్లం, గుమ్మడి కాయలు "దానమి"స్తారు. పితృదేవతలకు "తర్పణాలు"
వదులుతారు. ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "రథం" ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ "గొబ్బెమ్మలు"
పెడతారు. మూడవ రోజు "కనుమ పండగ" ఈ రోజును "పశువుల పండుగ" అని కూడ అంటారు.
వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు. పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.
పశువుల కొట్టంలో "పొంగలి" వండి అందులో పసుపు, కుంకుమ కలిపి
పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని
దేవతలను ప్రార్ధిస్తారు. గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి
పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు,
కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు,
కోడి పందెములు, గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి
సాయంత్రము జరుపుతారు. "కనుమ" రోజు "మినుము" తినాలని "గారెలు" చేసుకొని తింటారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ
కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు!!!
Comments
Post a Comment