స్మశాన వేదాంతం.!

స్మశాన వేదాంతం.!

(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

.

.......

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌

నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

..........

కన్యాశుల్కం...(గురజాడఅప్పారావు.)

.

ఇల్లు ఇల్లుఅనేవు ఇల్లు నదనేవు.. నీఇల్లుఎక్కడేచిలుక.

ఊరికి ఉత్తరాన సమధి పూరిలో కట్టే ఇల్లు ఉన్నదే చిలుక

మోసేరునలుగురు వెంబడిపదిమంది వెంటనెవరు రారుచిలుక

కాలి పోయేదాక కావలిఉందురు కాని వెంటనెవరు రారుచిలుక!

Comments