అహంకారం పతన హేతువు .

అహంకారం పతన హేతువు .

.

గంభీరా గగానాంతస్తా గర్వితా గానలోలుపా యైనమః . . . . . . . . . . . . . . . 

మంత్రం . . అర్థం . . . . . 

గర్వం . గంభీరం కళాసక్తి మొదలైన వి కూడా అమ్మ వారి స్వరూపాలే . ఎలాగంటే . అత్యంత వుఛ్చస్తితి లో అవున్నత్యం వుంటుంది విషయ పరిజ్ఞానం లోతైన విచారణ వున్న తమైన విద్యా పదవి గౌరవం ప్రతిష్టా శక్తి సామధ్యం ఐశ్వర్యం అందం బలం ఇలా ఏవి అధికంగా . వున్న అది గర్వ కారణం అవుతుంది కానీ అహంకారం కారాదు ఆకాశం వున్నతమైంది సూన్యంతో పోలుస్తాం కానీ ఎంత పరిశోధించినా అంతు పట్టని విశేషాలు కలిగి ఎత్తు కి ఎదిగి వుంది సముద్రం కూడా . అంతే లోతుగా నిండుగా గంభీరంగా వుంటుంది తెలుసిందానికన్నా తెలుసుతెలుసుకోవలసింది ఎప్పుడూ రెట్టింపు వుంటుంది అది లోతైన అధ్యయనం కి గుర్తు . . అమవారు సముద్ర మంత లోతు నుండి ఎత్తైన గగనానికి చేరి గర్వించి పరవశిస్తుంది . పర వశ అంటే పరమ శివుని చేరి వివశ అవుతుంది వివశత్వంలో గంభీరత గర్వం అతిశయమౌతాయి ఆ గర్వానికి గంభీరతకు అందరూ తలవంచవలసందే . గానం అన్నా కూడా అమ్మ వారికి చాలా ఇష్టం అందులో సామగానం . అంటే మక్కువ పరవశించి పోతుంది . గంధర్వులు అమ్మవారిని గానంతోనే అర్చిస్తారు . మనం ఎంత పెద్ద పదవిలో వున్నా ఎంత సాధించినా ఎంత అందం . ఐశ్వర్యం . బలం విద్యా వున్నా కూడా గాంభీర్యాన్ని గర్వాన్ని ప్రదర్శిద్దాం అహంకారం మాత్రం వద్దు . అహంకారం పతన హేతువు . మనలో అహంకారాన్ని తుంచివేయమని అమ్మ కి నమస్కారం చేద్దాం

(చిత్రం..రాజారవివర్మ..)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!