Posts

అధ్యాత్మవిద్య!

Image
- - అధ్యాత్మవిద్య! - అధ్యాత్మవిద్య అధ్యయనం చేయడం చాలా కష్టం,  దాన్ని ఆచరించడం మరింత కష్టం. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు: . మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః ; దీని భావం, "వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

వివేకచూడామణి!

Image
వివేకచూడామణి! . "భక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే "  అంటారు శంకరాచార్యులు తన వివేకచూడామణిలో.. . కానీ ప్రస్తుతకాలంలో" పక్కవాడు ఏది చెస్తే దానిని మరో ఆలోచన లేకుండా అనుకరించడమ" భక్తిలా తయారయ్యింది దురదృష్టవశాత్తూ మన వ్యవస్థలో... . శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు  అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు.  కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య)- శ్లోకం - 7

Image
- మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 7 బాలస్తావత్క్రీడాసక్తః  తరుణస్తావత్తరుణీసక్తః| వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపిన సక్తః|| - శ్లోకం అర్ధం : బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.  - తాత్పర్యము : బాల్యములో, తెలిసీ తెలియని వయసులో సమయమునంతా ఆట పాటలకు వ్యర్థము చేసుకోనుచున్నాము. పిమ్మట యుక్త వయస్సు రాగానే, స్త్రీ వ్యామోహములో పడి కామ-క్రీడలకు సమయము వృధా చేయుచున్నాము.  ఆ పిమ్మట వృద్ధాప్యములో ధన, కాంత, కనకాల మీద ఆశ తీరక జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము.  ఇంక భగవంతునిపై తలపు ఎప్పుడు? జీ వితకాలమంతా యిటుల వృధా అయిన సాధించినది ఏమి? కావున కర్తవ్యము నెరిగి, పరమాత్మునిపై మనస్సు నిలిపి,  గోవింద స్మరణతో జీవితము పునీతము చేసుకొనుము.  ఆత్మ నిగ్రహముతో, పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము. నేడు, రేపు అని రోజులు గడుపకుము.  ...

శుభం -సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (29)

Image
- శుభం -సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (29) కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభ భిదః కఠోరే కోటీరేస్ఖలసి జహి జంభాది మకుటమ్, ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే !! - మాతా ! ఈ బ్రహ్మ విష్ణువు ఇంద్రులు మొక్కుతూంటే నీ భవనాన్ని ప్రవేశించిన సదాశివుడిని ఎదురుకొన డానికి అతి శీఘ్రముగాలేచి వెళ్ళే టప్పుడు నీ పరిజనులైన స్త్రీ లు , అమ్మా! నీముందు బ్రహ్మ దేవుడి కిరీటము ఉంది . దానికి దూరంగా నడువు, ఓ తల్లీ ! ఇది కైటభాసురుణ్ణి సంహరించిన విష్ణువు కిరీటము తొట్రు పడబోకు, అమ్మా! ఇది ఇంద్రుడి కిరీటము ,  దీని అగ్రభాగం తాకి జారుతావేమో జాగ్రత్తగా రమ్ము, అనే మాటలు సర్వోత్కర్షతో రాజిల్లుతూన్నవి. - ఓం సత్యధర్మరతాయైనమః ఓం సర్వరక్షిణ్యైనమః ఓం శశాంకరూపిణ్యైనమః

వికటకవి..

Image
= వికటకవి.. తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. . ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు, ఎమి తిని సెపితివి కపితము బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో ఉమెతకయలు తిని సెపితో అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా || ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు. కావలి తిమ్మడు మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !! అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి తిరుమలరాయల గురించి రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు. ...

పార్వతి గుస గుస -గంగమ్మరుస రుస -నాగరాజ్ బుస బుస !

Image
- పార్వతి గుస  గుస  -గంగమ్మరుస రుస -నాగరాజ్ బుస బుస ! - మెడ నాగయ్యకు నొక్కటే బుసబుసల్! మేనన్ సగంబైన యా బిడతో నీకిక నెప్పుడున్ గుసగుసల్! వీక్షించి మీ చంద మె క్కడలేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్! నీ చెవిన్ బడుటేలాగునొ మా మొఱల్! తెలియదప్పా మాకు మృత్యుంజయా! . (మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయము" నుండి) . భావము: ఓ శంకరా!  నీ మెడలోనున్న నాగరాజు ఎప్పుడూ బుసబుసమని బుసలు కొడుతుంటాడు. నీ అర్ధశరీరాన్ని ఆక్రమించుకున్న పార్వతమ్మతో నీకెప్పుడూ గుసగుసలే!  ఇక, మీ ఇద్దరి వరుస చూస్తూ, తలపైనున్న గంగమ్మ అసహనంతో రుసరుసలాడుతుంటుంది. ఈ గందరగోళములో మా ప్రార్థనలు నీ చెవికి ఎలా సోకుతాయో మాకేమీ తెలియడంలేదు స్వామీ!  —

ప్రత్యగ్ రూపాయ నమః ". . .ఇది మంత్రం

Image
- "ప్రత్యగ్ రూపాయ నమః ". . .ఇది మంత్రం  . . . . ఇది దానిఅంతర.అర్థం . . . . .  . అమ్మ సర్వాంతర్యామి . స్థూలంగా చూడటానికి దృష్టి సరిపోదు .  అందుకే అమ్మ తనను ఎలా చూడవచ్చో విశద పరచింది .  . అదే అంతర్ముఖ సాధన. మనం నిదురించే సమయంలో మనకి మనఎదురు  గుండా వున్నది కూడా చూడలేం . అలాగని ఎదురుగా వున్నది లేనట్టు కాదు . అలాగే మనం పుట్టినప్పటి నుండీ వున్నామనుకుంటాం. ఎప్పటి నుంచో వున్న ఆత్మ దేహాన్ని ధరించినట్టు తెలుసు కోలేం. .  అలాగే ఒక రైలు మనం ఎక్కినపుడు , ఎక్కిన చోటును  , ఇక్కడే రైలు మొదలైంది అనుకుంటాం. నిజానికి అది ఎక్కడ నుండి వస్తోంది అని ఆలోచిస్తూ దాని వునికి తెలుసుకోవటమే ప్రత్యక్ అనబడుతుంది.  అలాగే మనం మనలోని ఆత్మని దర్శించ లేక పోవడం , మేలుకుని వున్నా , నిదురించి నట్టే లెక్క. ఆత్మ పరిశీలన అంతర్ముఖంగా జరగాలి  ఆత్మ పరదేవతా స్వరూపం . మనలోని ఆత్మ పరదేవతకి భిన్నం కాదు కాబట్టి ,  ఎవరు ఆత్మ దర్శనం చేయగలరో, వారే ప్రత్యక్ వైభవాన్ని తెలుసు కోగలరు  . ప్రత్యగ్ రూపిణికి నమస్కారం .