Skip to main content
ప్రత్యగ్ రూపాయ నమః ". . .ఇది మంత్రం
-
"ప్రత్యగ్ రూపాయ నమః ". . .ఇది మంత్రం
. . . .
ఇది దానిఅంతర.అర్థం . . . . .
.
అమ్మ సర్వాంతర్యామి . స్థూలంగా చూడటానికి దృష్టి సరిపోదు .
అందుకే అమ్మ తనను ఎలా చూడవచ్చో విశద పరచింది .
.
అదే అంతర్ముఖ సాధన. మనం నిదురించే సమయంలో మనకి మనఎదురు
గుండా వున్నది కూడా చూడలేం . అలాగని ఎదురుగా వున్నది లేనట్టు కాదు . అలాగే మనం పుట్టినప్పటి నుండీ వున్నామనుకుంటాం.
ఎప్పటి నుంచో వున్న ఆత్మ దేహాన్ని ధరించినట్టు తెలుసు కోలేం.
.
అలాగే ఒక రైలు మనం ఎక్కినపుడు , ఎక్కిన చోటును
, ఇక్కడే రైలు మొదలైంది అనుకుంటాం. నిజానికి అది ఎక్కడ నుండి వస్తోంది
అని ఆలోచిస్తూ దాని వునికి తెలుసుకోవటమే ప్రత్యక్ అనబడుతుంది.
అలాగే మనం మనలోని ఆత్మని దర్శించ లేక పోవడం ,
మేలుకుని వున్నా , నిదురించి నట్టే లెక్క. ఆత్మ పరిశీలన అంతర్ముఖంగా జరగాలి
ఆత్మ పరదేవతా స్వరూపం .
మనలోని ఆత్మ పరదేవతకి భిన్నం కాదు కాబట్టి ,
ఎవరు ఆత్మ దర్శనం చేయగలరో,
వారే ప్రత్యక్ వైభవాన్ని తెలుసు కోగలరు
. ప్రత్యగ్ రూపిణికి నమస్కారం .
Comments
Post a Comment