Skip to main content
శుభం -సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (23)
శుభం -సౌందర్య లహరి
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
-
శ్లోకము (23)
త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా
శరీరార్థం శమ్భోరపరమపి శఙ్కే హృత మభూత్,
యదే తత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటం !!
ఓ జగన్మాతా ! నువ్వు తొలుత శంభుని వామ
భాగాన్ని గ్రహించి తనివి తీరని మనస్సు తో తక్కిన
సగం కూడా గ్రహించావని నేను తలచు చున్నాను .
ఎందుకంటే నీ శరీరమంతా ఉదయకాలంలోని
బాల భానుడి కాంతితో సాటివచ్చే కెంపు కాంతుల
తో ఒప్పారుతూ, త్రినయనా, పాలిండ్ల జంటచే
యించుక ముందుకు వంగినట్లు కనబడుతూ ,
వంపు తిరిగిన చంద్ర కళను శిరోమణి గా గల
కిరీటముతో సొంపారుతూ విరాజిల్లుతూన్నావు.
ఓం చిదంబరశరీరిణ్యైనమః
ఓం శ్రీ చక్రవాసిన్యైనమః
ఓం దేవ్యైనమః
Comments
Post a Comment