సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (26)

-

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (26)

విరిఞ్చిః పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం

వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనమ్,

వితంద్రీ మహేన్ద్రీ వితతిరపి సమ్మీలిత దృశా

మహా సంసారేస్మి న్విహరతి సతి త్వత్పతిరసౌ !!

-

తల్లీ ! జగజ్జననీ ! మహాప్రళయం సంభవించిన సమయంలో

బ్రహ్మ పంచత్వం (మృతి) పొందుతున్నాడు. మహావిష్ణువు 

విరామాన్ని గాంచుతూన్నాడు. యముడు నాశమవుతున్నాడు.

కుబేరుడు కాలధర్మం పొందుతున్నాడు. పదునల్గురు మనువులు, 

పదునల్గురు ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కానీ ఓపతివ్రతా !

ఈసహస్రదళ కమలంలో కన్పట్టుతూ నీ భర్త సదాశివుడు

విశృంఖలుడై స్వేచ్చగా విహరిస్తున్నాడు.

-

ఓం కళ్యాణ్యైనమః

ఓం కమలాయైనమః

ఓం అచింత్యాయైనమః

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!