శ్రీ కాళహస్తీశ్వర శతకము! (బాపూ గారి బొమ్మ.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము!

(బాపూ గారి బొమ్మ.)

.

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే

వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే

చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

-

భావం:

శ్రీ కాళహస్తీశ్వరా! 

మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిథిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై

రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ

భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై

చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.