ఎడ్డెం అంటే తెడ్డెం- ఉద్దాలకుడు -చండి !

ఎడ్డెం అంటే తెడ్డెం- ఉద్దాలకుడు -చండి !

-

ఉద్దాలకుడు ఒక ముని అతని భార్య చండి.

భర్త ఏమి చెప్పినా, చండి దానికి వ్యతిరేకంగా చేస్తూ వుంటుంది, గురువుగారి సలహా మేరకు ఆయన తండ్రి ఆబ్ధికం చేయదలిచి,

భార్యతో నేను రేపు మా తండ్రిగారి ఆబ్దికం చేయబోవడం లేదు అన్నాడు.అందుకు ఆవిడ అదెలా చెయ్యరు?చెయ్యవలిసిందే అంటుంది.

యింకా అలాగే నేను ఆబ్దికానికి కావలిసిన సరుకులు తేను,బ్రాహ్మలను పిలవను అంటే ఆమె అన్నిటికీ చేయవలిసిందే అని అంటుంది.. , 

ఆబ్దికం సక్రమంగా జరుగిపోయింది.అంతా సరిగా జరిగిపోయిందన్న ఆనందం లో పిండాలను నదిలో కలపాలి అంటాడు ఉద్దాలకుడు.చండి పిండాలను నదిలో ఎలా కలుపుతారు?అంటూ పెంట కుప్ప మీద పారవేస్తుంది., ఆయన కోపం పట్టలేక ఆమెను శిలగా మారమని శాపం యిస్తాడు., ఆ తరువాత......

శిలగా మారిపోతున్న చండికి పశ్చాత్తాపం కలుగుతుంది. పూర్తిగా మారకముందే భర్త కాళ్ళ మీద పడి క్షమించి శాప విముక్తి ప్రసాదించమని వేడుకుంటుంది.

అనేక వేల సంవత్సరాల తరువాత కృష్ణుడి అనుంగు శిష్యుడైన నరుడి (అర్జునుడి) కరస్పర్శతో నీకు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఉద్ధాలకుడు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు రాజసింహాసనం అధిరోహించాక అశ్వమేధయాగం చేస్తాడు. ఆ సమయంలో అశ్వం వెనకాల రక్షణగా అర్జునుడు పోతూ వుంటాడు. అట్లా పోతూ దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పెద్ద కొండలాగా పడి వున్న శిల కనిపించగా అశ్వాలకున్నసహజగుణం వల్ల రాయి కనిపించగానే యాగాశ్వం శరీరం రాతికి రుద్దుకుంటూ గోక్కుంటుంది.

అంతే వెంటనే ఆ గుర్రం శరీరం ఆ రాతికి అతుక్కు పోతుంది. అర్జునుడి సైన్యం గుర్రానికి నిద్ర వచ్చి మత్తుగా పడుకుందేమో అనుకుంటారు. కాని అక్కడి నుండి బయటకు రావటానికి గింజుకుంటున్న గుర్రాన్ని చూసి సైనికులు రాతి నుండి విడదీయటానికి విశ్వప్రయత్నం చేస్తారు.కానీ విఫలులౌతారు..

అంతా రాక్షస మాయ అనుకుంటారు. అశ్వమేధ యాగానికి అంతరాయం కలిగిందని అర్జునుడికి దిగులు పట్టుకుంటుంది.

ఆ గుర్రాన్ని రాయి నుండి విడదీసే ప్రయత్నంలో దానికి బాధ కలుగుతూంది కానీ అది ఆ శిలనుండి విడివడదు.ఏమి చెయ్యాలో తోచక తిరుగుతున్న అర్జునుడికి ఆ చుట్టుపక్కల మున్యాశ్రమం కనిపించింది.ఆ ఆశ్రమములో సౌభరి అనే ముని వుంటాడు. ఆయనకు తన సమస్యను వివరిస్తాడు అర్జునుడు.

సౌభరి చండి వృత్తాంతం వివరించి శాపవశాత్తు శిలగా మారిన చండికి శాప విముక్తి కలగటానికి ఇంకా కొన్ని ఘడియల సమయం వుంది . ఇంత వరకు నీ సైనికులే విడదీయటానికి ప్రయత్నం చేశారు . నువ్వు వెళ్ళి ఆ శిలను ముట్టుకో అన్ని సర్దుకుంటాయి అంటాడు. ముని మాటలు విన్న అర్జునుడు చండిదేవికి ఉద్దాలకుడికి మనస్సులోనే నమస్కరించుకొని శిలను ముట్టుకుంటాడు.

వెంటనే చండికి శాప విముక్తి కలిగి "కృష్ణుడి అనుచరుడివి. నీ పవిత్ర స్పర్శ చేత నా పాపం తొలిగి పోయింది" అని కృతఙ్ఞతా భావంతో అర్జునుడ్ని ఆశీర్వదిస్తుంది.

ఇంతలో ఉద్ధాలకుడు అక్కడకు చేరుకొని భార్యా సమేతంగా వెళ్ళిపోతాడు.

అర్జునుడు అశ్వమేధయాత్ర కొనసాగిస్తాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!