కార్తీక పురాణము 28వ రోజు!

కార్తీక పురాణము 28వ రోజు!

-

విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు ఆలోచింపక మహాభక్తునిశుద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపైగల అనురాగముతో ద్వాదశి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. గాని నాదుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీనిష్కళంక భక్తి ముందవియేమియు పనిచెయలేదు. నన్నివిపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నామన: పూర్వక వందనములు. ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒకవేళ నీకర్త వ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీదుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకొటులన్నియు ఒక్కటిగా యేకమైన నూ నిన్నేమియు చెయజాలవు, నీ శక్తికి యేవిధ మైన అడ్డునూలేదు. ఈ విషయములోక మంతటికి తెలియును. అయిననుముని పుంగవునికి యేఅపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను. నీయుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణువేడిన యీదుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీషుని ప్రార్దనలకు శాంతించి" ఓ భక్తగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతులైన మధుకైటభులను- దేవతలందరు యెకమైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును.

ఇది యెల్లరకు తెలిసిన విషేయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైపగబూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలనని కన్నులెర్ర జేసినీమీదజూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిర పరాధవగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తీలో నాకంటె యెక్కువేమియుగాదు. సృషికర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవతియగు మహేశ్వరునితే జశ్శక్తి కంటెను యెక్కువ మైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియతేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నే దుర్కొన జాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్త మము. ఈనీతిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయిన ను తప్పించుకోన గలరు. ఇంత వరకు జరిగిన దంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆదుర్వాసుని గౌరవించి నీధర్మము నీవు నిర్వరింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవగో , బ్రాహ్మణాదుల యుందును, స్త్రీ లయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేనునియే నాయభిలాష . కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైన నూ నీ శక్తీకి, తేజస్సు కూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి, తనకుక్షియుందున్న పధాలుగులోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రా యుధ పు పాదముల పైపడెను. అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీసిగాడాలింగన మొనర్చి " అంబరీషా! నీనిష్కళంక భక్తి కి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరుపరింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో, యెవరోపరులను హింసించక - పరధనములను ఆశ పడక- పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములునశించి, యిహమందున పరమందున సర్వ సాఖ్యములతో తులతూగుధురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీద్వాదశి వ్రతప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీమునిపుంగవునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యామమ్యెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!