సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (28)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (28)

సుధామ ప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం

విపద్యన్తే విశ్వే విధి శతమఖాద్యాదివిషదః ,

కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా

న శమ్భోస్తన్మూలం తవజననితాటఙ్క మహిమా !!

-

తల్లీ ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకలదేవతలూ

భయంకరమైన జరా మృత్యువు లను హరించే

అమృతాన్ని గ్రోలి ప్రళయ కాలంలో మరణిస్తూన్నారు

అతి భయంకరమైన లోకాలను దహించే కాలకూట

మనే మహావిషాన్ని భక్షించిన నీ పతి శంభుడికి

(శివుడికి) మరణం సంభవించలేదు.

ఇందుకు 

ముఖ్య కారణం నీచెవులలో భాసిల్లే రత్న తాటంకాల

(రత్నాల కమ్మల) ప్రభావమే కదా !

.

ఓం సత్యధర్మరతాయైనమః

ఓం సర్వరక్షిణ్యైనమః 

ఓం శశాంకరూపిణ్యైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!