సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (25)

-

శుభం -సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (25)

త్రయాణాం దేవానాంత్రిగుణజనితానాం తవ శివే

భవేత్పూజా పూజా తవ చరణ యోర్యా విరచితా, 

తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే

స్థితా హ్యేతేశశ్వన్ముకుళిత కరోత్తంస మకుటాః !!

-

ఓ శివుని పట్టపు రాణీ ! నీ చరణాలకు గావించే

పూజే నీ త్రిగుణాల వల్ల జనించిన వారైన త్రిమూర్తు

లకు చేసే పూజ , వేరైన ది పూజ కాబోదు. అది యుక్త

రవుతుంది. ఎందుకంటే నీ పాదాల ను సదా వహిస్తూన్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో

నీకనకరత్నసింహాసనం చెంత చేరి హస్తాలు మోడ్చి, 

తమ శిరము లందలి రత్న కిరీటాలలో జోడించి

మొక్కుతూయీ త్రి మూర్తులుసదా నీ ఆఙ్ఞను

వర్తించు చున్నా రు కదా! భగవతి పాదపీఠ సేవ

భగవతీ ప్రసాదం వలననే లభిస్తుందని భావం.

-

ఓం పుత్రపౌత్ర వరప్రదాయైనమః

ఓం పుణ్యాయైనమః

ఓం కృపాపూర్ణాయైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!