ఆనందం- అర్ణవం -అద్వైతం!!


-

ఆనందం- అర్ణవం -అద్వైతం!!

-

ఎదగడం పరిణామం చెందడంలో ఆనందం ఉంది .

పరిణామం ప్రమోషన్ లాంటిది.

రెండింటివల్ల గత జీవితం నుండి విముక్తి లభిస్తుంది.

స్వేచ్చ అనేది బయట ఎక్కడో విడిగా లేదు. 

గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడమే స్వేచ్ఛ.

వానరుడు పరిణామం చెంది నరుడయ్యాడు.

నరుడు పరిణామం చెందితే నారాయణుడౌతాడు.కాబట్టి వానరుడు,నరుడు,నారాయణుడు ముగ్గురు లేరు.

ముగ్గురూ ఒకే జీవితానికి చెందిన మూడు దశలు. 

అద్వైత సిద్ధాంతం చెప్పేది ఇదే.

అన్ని దశలూ దాటి వచ్చిన నారాయణుడికి వివిధ దశల్లో ఉన్న జీవుల బాధలూ,బలహీనతలూ తెలుసు.

అన్నిదశలూ దాటి వచ్చిన వాడు కాబట్టే నారాయణుడు నరులతో,వానరులతో సహవాసం చేయగలిగాడు.

కానీ శ్రీరాముడితో సంవాదం తరువాత ఆంజనేయుడు,

భగవద్గీతను విన్న తరువాత అర్జునుడు పరిణామం చెంది నారాయణుడికిదగ్గరయ్యారు.

తమకూ నారాయణుడికీ(జీవేశ్వరులకి) ఉన్న పరిణామ సంబంధాన్ని వారు గుర్తించారు.

జీవేశ్వరులు ఒకరే అంటుంది అద్వైతం. 

ఒకరే అయినా పరిణామం చెందడంలో వారి మధ్య ఉన్నఅంతరాన్ని గుర్తించి గౌరవించమంటుంది విశిష్టాద్వైతం. 

జీవుడు వేరు ,ఈశ్వరుడు వేరు అంటుంది ద్వైతం.

ఈ అద్వైత వ్యాసంలో జీవేశ్వరుల మధ్య ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది.

అద్వైతం

.

(భావరాజు శ్రేనివాస్ గారికి కృతజ్ఞలతో)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!