పార్వతి గుస గుస -గంగమ్మరుస రుస -నాగరాజ్ బుస బుస !

-

పార్వతి గుస  గుస  -గంగమ్మరుస రుస -నాగరాజ్ బుస బుస !

-

మెడ నాగయ్యకు నొక్కటే బుసబుసల్! మేనన్ సగంబైన యా

బిడతో నీకిక నెప్పుడున్ గుసగుసల్! వీక్షించి మీ చంద మె

క్కడలేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్! నీ చెవిన్

బడుటేలాగునొ మా మొఱల్! తెలియదప్పా మాకు మృత్యుంజయా!

.

(మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయము" నుండి)

.

భావము: ఓ శంకరా! 

నీ మెడలోనున్న నాగరాజు ఎప్పుడూ బుసబుసమని బుసలు కొడుతుంటాడు.

నీ అర్ధశరీరాన్ని ఆక్రమించుకున్న పార్వతమ్మతో నీకెప్పుడూ గుసగుసలే! 

ఇక, మీ ఇద్దరి వరుస చూస్తూ, తలపైనున్న గంగమ్మ అసహనంతో రుసరుసలాడుతుంటుంది.

ఈ గందరగోళములో మా ప్రార్థనలు నీ చెవికి ఎలా సోకుతాయో

మాకేమీ తెలియడంలేదు స్వామీ! 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!