శుభం -సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (24)

శుభం -సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (24)

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశ స్తిరయతి,

సదా పూర్వ స్సర్వంతదిద మను గృహ్ణాతి చ శివ

స్తవాఙ్ఞామాలమ్బ్య క్షణచలిత యోర్భ్రూలతికయోః!!

-

ఓ భగవతీ! సృష్టి కర్తయైన బ్రహ్మ యీ విశ్వాన్ని

సృష్టిస్తూన్నాడు. మహా విష్ణువు రక్షిస్తున్నాడు. 

రుద్రుడు విశ్వాన్ని లయింప జేస్తూన్నాడు. మహేశ్వరు

డు యీ బ్రహ్మ విష్ణు రుద్రులను తనలో లీనం చేసుకొని మహేశ్వర తత్త్వంలో అంతర్భూతం

చేస్తూన్నాడు. ఇలా యీ బ్రహ్మాండం లయమయి

పోతోంది . సదాశివుడుయిదంతా క్షణ వికాసంగల

నీ కనుబొమల ఆఙ్ఞను పొంది యీ నాలుగు

తత్త్వాలను అనుగ్రహించి వారితో మళ్ళా యథా

విధిగా యీ బ్రహ్మాండ సృష్ట్యా ది కార్యాలు జరిపి

స్తూన్నాడు. ఇదంతా నీ కనుబొమల కదలిక చేతనే

కలుగు తున్నదని భావం.

-

ఓం కామేశ్వరపత్నైనమః

ఓం కమలాయైనమః

ఓం మురారిప్రియార్థాంగ్యైనమః

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!