ఉయ్యాల లూగవయ్య!


-

ఉయ్యాల లూగవయ్య! 

-

ఉయ్యాల లూగవయ్యా శ్రీరామ 

సయ్యాట పాటలను సత్సార్వభౌమ .

-

పాటలో దాగి ఉండే లయ మనస్సుకు తొందరగా పట్టుబడుతుంది లయతో పాటుగా మాటలు వచ్చేస్తాయి. అందుకే చిన్న పిల్లలకైనా పాట రూపంలో పాఠాలు చెప్తే చాలా తొందరగా నేర్చుకుంటారు. పైగా అందరూ కలిసి ఆహ్లదంగా పాడుకుంటారు.ఈ పద్ధతిలోనే ఈనాడు రైమ్స్ వంటివి పిల్లలకి నేర్పిస్తున్నారు. మనం నిత్యం కొలిచే దైవాన్ని "మేలుకోవయ్య మమ్ములుకో శ్రీరామ" అంటూ భౌళి రాగంతో రాముణ్ణి నిద్రలేపి, "ఉయ్యాల లూగవయ్యా శ్రీరామ" అంటూ నిలాంబరి రాగంతో నిద్రపుచ్చుతారు త్యాగరాజస్వామి.

(రాగం : నీలాంబరి -తాళం ఝుంప. )

పల్లవి

ఉయ్యాల లూగవయ్యా శ్రీరామ

అనుపల్లవి:

సయ్యాట పాటలను సత్సార్వభౌమ

చరణం:

1. కమలజాద్యఖిలసురలు నినుఁ గొల్వ 

విమలులైన మునీంద్రులు ధ్యానింప 

కమనీయభాగవతులు గుణకీర్త 

నమున నాలాపంబులు సేయగ

2. నారదాదులు మెఱయుచు నుతియింప 

సారముల బాగ వినుచు నిను నమ్ము 

వారల సదా బ్రోచుచు వేద 

సార సభలను జూచుచు శ్రీరామ

3. నవమోహనంగులైన సురసతులు 

వివరముగఁ బాడఁగ నా భాగ్యమా 

నవరత్నమంటపమున త్యాగరా 

జవినుతాకృతిఁ బూనిన శ్రీరామ

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!