మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య - శ్లోకం - 1

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

-

శ్లోకం - 1

భజగోవిన్దం భజగోవిన్దం 

గోవిన్దం భజమూఢమతే|

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే||

-

శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.

ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

-

తాత్పర్యము 

: పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము, ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము. హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం. ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిదురించు చున్నా, క్రీడించు చున్నా మనసున హరి ధ్యానమును మరువకుడు. 

--గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. 

మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు

(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!