శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాలా?

శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాలా? 

(శ్రీ టెకుమల్ల వెంకటప్పయ్య గారి కి కృతజ్ఞతలు తో )

వాల్మీకి రామాయణం లో ఒక శ్లోకం ఉంది గమనించారో లేదో.

."పితరం రోచయా మాస తదా దశరధం నృపం" 

దీన్ని మహాకవులు ఎంతో ఆలోచించి ఈ వాక్యాల మీద దృష్టి సారించారు. 

ఎక్కడ అవతరిస్తే..తన కార్యం సానుకూలం అవుతుందో...అవతారానికి పూర్తి 

పరమార్ధం ఏర్పడుతుందో కూలంకషం గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు 

మహా విష్ణువు. 

ధర్మార్ధ కామ మోక్షాలూ...ఈ పురుషార్ధ బీజ లక్షణాలు వాల్మీకి హృదయంలో గుభాళించే పరిమళాలూ ఆదర్శం మానవ జాతికి. 

ఇన వంశీయుల లో దిలీప మహారాజులో ధర్మ పురుషార్ధ పరిపక్వత ఉంది. 

రఘు మహారాజు లో అర్ధ పురుషార్ధ మహోత్తత. 

అజ మహారాజులో కామ పురుషార్ధ మహా వైభవాన్నీ..

ఇక మన దశరధ మహారాజులో మోక్ష బీజ లక్షణాలనూ నిక్షేపింపబడి ఉండడము లోక విహితం కదా! 

ఈ పురుషార్ధాల పౌష్కల్యం ఎక్కడ ఉన్నదో చూసుకుని మరీ మహా విష్ణువు అవతారం ఎత్తాడట.

రామాయణం వేద సమ్మితం. ఈ కావ్యాన్ని శ్రద్ధాసక్తులతో గమనిస్తే..అనుకరిస్తే..మానవ జాతికి మహా పురుష మార్గాలు సుగమము అవుతాయి. 

లక్ష్యం కరతలామలకం అవుతుంది. ఇన్న్ని మహార్ధాలను నిక్షేపించి మనకు శ్రీమద్రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహర్షి. ఇన్ని మహార్ధాలను మననం చేయగా చేయగా ...హృదయంలో సత్పురుష స్వభావ గరిమ ఎలాంటిదో అవగతమవుతుంది. అలా మనకు ఒక ఉదాత్త విరాట్స్వరూపం మననం జరిగిందా అలాంటి కావ్యానికి మహా ప్రయోజనం చేకూరినట్టే గదా? చివరగా ఒక మాట! 

మానవునికి వృత్త చికిత్స గానీ..కర్మ విచికిత్స గానీ కలిగినప్పుడు పరిష్కార మార్గానికి పరమోత్తమ మైన వ్యక్తుల ను ఆదర్శంగా తీసుకోవాలని వేదం శాసిస్తోంది. 

అటువంటి చరిత్రలే..ఇతిహాసాలే రామాయణ..మహా భారతాలు.

-

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!