Skip to main content
సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (19)
-
-
సౌందర్య లహరి!
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
శ్లోకము (19)
ముఖం బిన్దుం కృత్వా కుచయుగ మధస్తస్యతదధో
హరార్థం ధ్యాయేద్యో హరమహిషితేమన్మథ కలామ్,
నసద్యస్సఙ్క్షో భం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీన్దు స్తనయుగామ్ !!
-
ఓ మాతా ! నీ నెమ్మోమును బిందువుగా జేసి , దాని
క్రిందుగా కుచయుగమునుంచి,, దాని క్రిందుగా
త్రికోణముంచి నీమన్మథకల నెవడు ధ్యానిస్తాడో
అతడు మరుక్షణానే వనితలను సంక్షోభితలను
చేస్తున్నాడనటం మాత్రమే కాదు ఈ కనిపించే
సూర్య చంద్రు లిర్వురూ చనుగవ కాగా ఒప్పు
తూన్న ముల్లోకాలనే భ్రాంతినొంద మోహ పెట్టు
తున్నాడు.
-
ఓం సర్వమంగళాయైనమః
ఓం మంజుభాషిణ్యైనమః
ఓం మహేశ్వర్యైనమః
-
(శ్రీ లలితాంబికాయైనమః)
Comments
Post a Comment