Posts

జై రాధే శ్యామ్ ! 🤲

Image
జై రాధే శ్యామ్ ! 🤲 రాధే రాధే రాధే రాధే, రాధే గోవిందా, వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ పురాణ పురుష పుణ్య శ్లోక, రాధే గోవిందా, వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ నంద ముకుంద నవనీత చోర, రాధే గోవిందా, యశోదా బాల యదుకుల తిలక, రాధే గోవిందా, వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ కాలియ నర్తన కంస నిశూదన, రాధే గోవిందా, గోపీ మోహన గోవర్ధన ధర రాధే గోవిందా, వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ రాధా వల్లభ రుక్మిణీ కాంత రాధే గోవిందా, వేణు విలోల విజయ గోపాల, రాధే గోవిందా , వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ భక్త వత్సల భాగవత ప్రియ, రాధే గోవిందా, పంఢరీనాథా పాండురంగా రాధే గోవిందా, వృన్దావన చందా । అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శివ తపోభంగము.🌹

Image
శివ తపోభంగము.🌹 (నెట్ నుండి ఈ మధ్య విరిసిన చంద్రికలు .) 💥 ‘మన్మధుని శరాలతో తపోభంగమై కళ్ళుతెరిచి గిరిజను చూసిన క్షణంలో శివుని మనస్సులో ఎలాంటి భావాలు కలిగాయి’ 💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘 కం. కన్నులు తెరచిన క్షణమున పన్నగ భూషణుడు గాంచె పర్వత పుత్రిన్ వన్నెల పూవుల పూజకు సన్నద్ధము జేసితెచ్చి సన్నిధి నిలువన్ 💘💘 ఉ. ఆనిమిషమ్మునందు మరుడాతని గుండెను నాటినట్టి బా ణానికి దీటువచ్చు హరిణాంకముఖీ సుమసౌమ్య దృక్కులా స్థాణు హృదంతరాళమును దాకె, తపస్సిటు భంగమాయెనో! పూనిన సంయతిన్ ఫలము పొందెనొ! దోచని సంశయమ్మునన్ 💘💘 సీ. పలుమార్లు జూచిన పార్వతి యందాలు కొంగ్రొత్తగా నేడు గోచరించు వణికించు శీతాద్రి పై వీచు పవనాల ఉష్ణాన తన తనువు చెమరించు ’స్వామీ!’ యని గిరిజ వచియించు పలుకులు ప్రణయ భావమ్ముల ప్రతిఫలించు శైల ధన్వుని మీద స్మరుని సుమాస్త్రాలు ముప్పిరి గొని నేడు మోహరించు 💘💘 తే.గీ. అవతరించిన తొలిప్రేమ భావమొకట భగ్నమాయెను తపమన్నబాధ యొకట క్రొవ్విదముసేయు మరునిపై క్రోధమొకట కలిసిపోయెను ముక్కంటి కన్నులందు.  💘?...

**సాలిగ్రామం**

Image
**సాలిగ్రామం** సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం  అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది.  అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి.  గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు.  వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి.  తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది.  గండకీ ఒక వేశ్య. గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ...

కొల్హాపూర్ - శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు🔔

Image
కొల్హాపూర్ - శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు🔔 💥 శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని  మహారాష్ట్ర రాష్ట్రనికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం.  ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. 💥💥 పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. 7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. 💥💥💥 ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు.  💥💥💥 ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల  వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువ...

పలుకు తేనియలు - కాళిదాసు కధ !

Image
పలుకు తేనియలు - కాళిదాసు కధ ! భార్య శాపం ఇచ్చిన తరువాత అక్కడ నుండి బయటకు వెళ్ళిన కాళిదాసు వేశ్యాలోలుడౌతాడు. అద్భుతమైన రచనలు చేస్తూ భోజుడి సభలో పండితుడిగా పేరు పొంది ఎన్నెన్నో రచనలు చేస్తాడు. కాని రాజుకు కాళిదాసుకు తరుచుగా వాగ్వివాదాలు జరగటం కాళిదాసు అలిగి రాజ్యం వదిలి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అట్లా ఒకసారి రాజు కోపంలో కాళిదాసుకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అతను వెళ్ళి ఒక వేశ్య ఇంట తలదాచుకొని అఙ్ఞాతంలో నివసిస్తూ ఉంటాడు. ఆ సమయంలో భోజుడు రామాయణం చంపూ కావ్యం రచిస్తాడు. ఆ కావ్యం కాళిదాసు చదివి సవరణలు చేయాలని ఆయనకు ఆరాటం. కాని కాళిదాసు ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు. కాళిదాసు కవితాప్రాభవం తెలిసిన రాజుగారు ఒక సమస్యా పూరణం చేయమని ప్రకటిస్తాడు. పూరించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని కూడా అంటాడు. "కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే" అంటే ఒక పుష్పం మీద మరో పుష్పం పూసింది అన్న మాట వినటమే కాని ఎక్కడా చూడలేదు. ఈ సమస్యకు పూరణ కేవలం కాళిదాసే చేయగలడు అన్న నమ్మకం రాజుకు. రాజుగారి ప్రకటన చూసిన కాళిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్యకు దురాశ కలుగుతుంది. ఎట్లాగయినా కాళిదాసు చేత ...

దయ ఎలా ఉంటుందంటే..!

Image
దయ ఎలా ఉంటుందంటే..! అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి. అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట. పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట. ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు. ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట. అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట. ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కిను...

ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️ (ముళ్ళపూడి గారి ముచ్చట్లు.) 🐦

Image
ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️ (ముళ్ళపూడి గారి ముచ్చట్లు.) 🐦 మీరు నమ్మండి- ఇది నిజం – మా హైకమాండ్ కమిటి సెలక్షన్ పరీక్షల్లో "హేమమాలిని, జయలలితను" కూడా చూసాం.  టెస్టులు తీసాం. వాళ్ళిద్దరూ సినిమాలకి పనికి రారని రూలింగ్ ఇచ్చేశాం! 👩 మొన్నటి హేమమాలిని – నిన్నటి డ్రీం గర్ల్ కాదు- సన్నగా చీపురుపుల్లలా చిటికెనవేలు లావుండేది. మాకు రేకు గ్లాసుల్లో టీ ఇచ్చింది. వాళ్ళమ్మగారు కూడా చెప్పారు- చాన్స్ ఇస్తే ఆపిల్సు, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తా నన్నారు. ఐనా మేం ఒప్పుకోలేదు. . తరువాత హేమ(గారు) అనంతస్వామి అనే లాయరు గారి కాంట్రాక్ట్ ద్వారా డ్రీం గర్ల్ గా రూపు ధరించి ఎదిగి రాజకపూర్ తీసిన ‘సపనోం కీ సౌదాగర్’ చిత్రంతో గొప్ప తార అయింది.  ‘షోలే’ లో వసంతి-‘నసంతి’ లాటి వేషాలతో రెండు దశాబ్దాలు (ధర్మేంద్ర) మహారాణిగా ఏలింది.  ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టారే! తన కూతుళ్ళతో పోటీపడి నాట్యం చేయగల గొప్ప నర్తకి. 👩 అలాగే జయలలితకి స్లైయిట్ మెల్ల (అదృష్టం మెల్ల) అన్నారు సెల్వరాజు గారు. ఆమె దరిమిలా తెలుగు తమిళ చిత్రాల్లో సూపర్ స్టార్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయిం...