శివ తపోభంగము.🌹


శివ తపోభంగము.🌹

(నెట్ నుండి ఈ మధ్య విరిసిన చంద్రికలు .)

💥

‘మన్మధుని శరాలతో తపోభంగమై కళ్ళుతెరిచి గిరిజను చూసిన క్షణంలో శివుని మనస్సులో ఎలాంటి భావాలు కలిగాయి’


💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘


కం. కన్నులు తెరచిన క్షణమున


పన్నగ భూషణుడు గాంచె పర్వత పుత్రిన్


వన్నెల పూవుల పూజకు


సన్నద్ధము జేసితెచ్చి సన్నిధి నిలువన్


💘💘

ఉ. ఆనిమిషమ్మునందు మరుడాతని గుండెను నాటినట్టి బా


ణానికి దీటువచ్చు హరిణాంకముఖీ సుమసౌమ్య దృక్కులా


స్థాణు హృదంతరాళమును దాకె, తపస్సిటు భంగమాయెనో!


పూనిన సంయతిన్ ఫలము పొందెనొ! దోచని సంశయమ్మునన్


💘💘

సీ. పలుమార్లు జూచిన పార్వతి యందాలు


కొంగ్రొత్తగా నేడు గోచరించు


వణికించు శీతాద్రి పై వీచు పవనాల


ఉష్ణాన తన తనువు చెమరించు


’స్వామీ!’ యని గిరిజ వచియించు పలుకులు


ప్రణయ భావమ్ముల ప్రతిఫలించు


శైల ధన్వుని మీద స్మరుని సుమాస్త్రాలు


ముప్పిరి గొని నేడు మోహరించు


💘💘

తే.గీ. అవతరించిన తొలిప్రేమ భావమొకట


భగ్నమాయెను తపమన్నబాధ యొకట


క్రొవ్విదముసేయు మరునిపై క్రోధమొకట


కలిసిపోయెను ముక్కంటి కన్నులందు.


 💘💘💘💘💘💘💘💘💘💘


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!