విశ్వనాథ ‘ఉద్విగ్నహృదయిని’ కిన్నెరసాని🌹

విశ్వనాథ ‘ఉద్విగ్నహృదయిని’ కిన్నెరసాని🌹


🏵️

తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’. ఆధునిక సాహితీ వృక్షపు శాఖ అయిన ‘భావకవిత్వం’ ఆంధ్ర సాహితీ సీమను తీర్చిదిద్దిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పపనిలేదు. 

భావకవిత్వంలో గల ఉప శాఖైలెన ప్రణయకవిత్వం, దేశభక్తికవిత్వం, ప్రకృతికవిత్వం, సంఘసంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతి కవిత్వాలలోని ప్రకృతి ఆరాధన - ప్రణయభావనల సమ్మేళనంగా సాగిందే ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది.


1921లో మనదేశమంతటా ప్రజ్వరిల్లిన సహాయ నిరాకరణోద్యమ పవనాలకు ప్రభావితుైడెన విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతున్న బి.ఎ తరగతికి సలాంకొట్టి ఉద్యమదారి పట్టారు. ఆ సంవత్సరమే ఉద్యమ నేపథ్యంతో ‘అంతరాత్మ’ అనే నవలా రచనకు శ్రీకారం చుట్టారు. ఉపాధి కోసం అదే ఏడాది బందరు ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టి 1926 వరకు కొనసాగారు. ఆ సమయంలోనే ‘కిన్నెరసాని పాటలు’ రాశారు. అవి 1969కి గాని పుస్తక రూపానికి చేరలేదు. 


కేవలం యాబై ఐదు పేజీలు గల ఈ మధురగేయ కా వ్యం ‘ఖండగతి’ అనే మాత్రా ఛందస్సులో నడుస్తుంది. ప్రతిపనికి ఏదో ఒక స్ఫూర్తి నేపథ్యం ప్రేరణ వున్నట్టుగానే విశ్వనాథ వారికి ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది. 

వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు. అక్కడి అడవితల్లి ప్రకృతి సోయగాలు కిన్నెరసాని సొగసులు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వెరసి పర్యాటకులకు కన్నుల పండుగే!!

జలాశయం దాటిన కిన్నెరసాని ప్రవాహం రాతి తోగుల గుండా ఇసుకతెప్పలు మీదుగా సాగి భద్రాచలం సమీపం లోని భూర్గంపాడు వద్ద గోదావరి ఒడి చేరుతుంది. 


ఇక విశ్వనాథవారి ఊహాకావ్యంలో కిన్నెరసాని ఒక తెలుగింటి కోడలు. భర్తను మనసుతో ఆరాధించిన మహాపతివ్ర త. తన దుఃఖాన్ని పోగొట్టుకునే శక్తిలేని ‘ఉద్విగ్నహృదయిని’. తన భర్త కూడా అంతే అనురాగవంతుడు. కాని తల్లి తన భార్యపై వేసే నిందలకుగాని, ఆమె పెట్టే ఆరళ్లకుగాని ఎదురు చెప్పలేని తల్లి బారి నుంచి భార్యను కాపాడుకోలేని ద యాహీనుడు అతడు. చివరకు అత్తగారు పెట్టే ఇబ్బందులు భరించడం కిన్నెరసానికి కష్టైమెంది. కళ్లతో గాక హృదయం తో దుఃఖిస్తుంది. ఆమె భర్త అటు తల్లిని కాదనలేడు, ఇటు భార్యను ఓదార్చలేడు. 

నిస్సహాయ స్థితిలో కిన్నెరసాని అడవుల వెంట పరిగెడు తూ అత్తింటి కష్టాలకు దూరంగా పారిపోతుంది. భర్త తనను విడిచి ఎక్కడకూ వెళ్లవద్దని తను కూడా ఆవెువెంట వచ్చి వె నుక నుంచి పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తాడు. వేణీబంధా న్ని పట్టబోతే నీరైతాకింది. చీరకొంగు పట్టబోతే అదీ నీరై తగిలింది. వాగు కనుక అది నీరే. కాని వాగును స్త్రీగా మాననీకరించి, ఆ స్త్రీ దుఃఖంతో నీరైందని చెప్పడంలో విశ్వనాథ వారి భావనాశీలత అగుపిస్తుంది. 

చివరికి కిన్నెర భర్త కౌగిలిలో కరిగి నీరై ప్రవహించింది. భర్త భార్య కోసం శోకించి చివరికి శిలగా మారిపోతాడు. తన కౌగిలి నుంచి జారి వాగుగా మారిపోయి వేగంగా సాగిపోతున్న కిన్నెరను చూసి ఆమె భర్త దుఃఖిస్తూ ఆమెను పిలవడంతో కథ మొదలవుతుంది. 


కిన్నెర మానవత్వం నుండి నదీత్వం పొందింది. ‘నాయిక నదిగా మారడవేు’ ఇందులోని చమత్కారం. నదిగా మారిన కిన్నెరసాని జలలక్షణాలతో ప్రవహిస్తుంది. కాని తన హృదయరేడు అయిన భర్తను విడువలేక గుట్టగా మారిపో యిన భర్తను భారంగా చూస్తూ వెనక్కి తిరిగి తిరిగి పరికిస్తూ ముందుకు పరుగులు తీసింది. అప్పుడే తనలోని సహజలక్షణాైలెన నృత్యం - సంగీతం వ్యక్తీకరణలు మొదలై, వీనులవిైందెన కిన్నెరసాని గానం వెలువడుతుంది. దూరాన గల సముద్రుడు పారవశ్యంతో పరవశించి నదీరూపంలో గల ‘కిన్నెర’’ రాక కోసం అనురాగంతో పరితపిస్తాడు.

నదీరూపం దాల్చిన కిన్నెర గుణం చేత మహాపతివ్రత సముద్రం ఆరాటపు పొంగును చూసి దిగులుపడి తనలోతా నై ఏడ్చింది. అంతలోనే తెలివి తెచ్చుకుని సముద్రుని భార్య అయిన గోదావరి ఒడిలో మాతృప్రేమ కొంగున కట్టుకుని చేరి అమ్మను చేరిన కూతురిలా తృప్తి చెందింది. అలా గోదారమ్మను చేరిన ‘కిన్నెరసాని’ శాంతించి దుఃఖానికి దూర మైంది. నిత్యం భద్రాద్రి రాముని పాదపూజలో భాగమై రామభక్తులకు చల్లని నీడ - నీరు అందిస్తూ పుణ్యవతిగా అలరారింది అంటూ కిన్నెరసాని పాటలకావ్యం పరిసమాప్తి చేస్తారు విశ్వనాథ సత్యనారాయణ.


కిన్నెరసాని జీవితఘట్టాల్ని ఎనిమిది భాగాలుగా విభజించారు విశ్వనాథ. అవి కిన్నెరపుట్టుక, కిన్నెర నడకలు, కిన్నెర నృత్యం, కిన్నెర సంగీతం, కడలిపొంగు, కిన్నెర దుఃఖం, గోదావరి సంగమం, కిన్నెర వైభవం. ఇలాంటి విభజనలతో సాగిన ఈ ‘కిన్నెరసాని’ కావ్య కదంబం కమనీయం రమణీయం వెరసి ఇదో ‘మధుర గేయకావ్యం’.

భార్యా వియోగంతో కలిగిన దుఃఖంలో కిన్నెర భర్త ఒళ్లు తెలియకుండా అయిపోతాడు. జడత్వస్థితికి చేరుకున్నాడనే భావం కలిగించడానికి ‘రాయిఓలె అయిపోవడం’లో చూపిస్తారు విశ్వనాథ! దీనిద్వారా కవిలోని ప్రతిభాపాటవాలు వెల్లడవుతాయి. ఈ పాటల కావ్యంలో తన భావుకత చూపించడంలో విశ్వనాథ నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. 

‘ఇప్పుడేగద నా కౌగిట / కప్పితినీ శోకమూర్తి / అప్పుడే నిలువున నీరై యెప్పుడు ప్రవహించితివే’ అంటూ కిన్నెర భర్త పలుకుల్లోని సౌకుమార్యాన్ని కవి వర్ణించిన తీరు భావనా రమణీయం.


కిన్నెరసాని నడకలలో వాగు ప్రవాహగతిని అనేక ఉపమానాలతో వర్ణించారు విశ్వనాథ. తెల్లపూల నదిలా, సిగ్గుపడు రాచకన్నెలా, అందం పోయిన రత్నపేటికలా వుందని. రాయి అయిన భర్త చుట్టూ సుడి తిరుగుతూ వదలలేక వదలి ముందుకు సాగింది హృదయభారంతో సాగిపోతున్న ఆవెుి స్థతిని ‘ఆవుపొదుగున పాలు ధారకట్టినయట్లు / వనదేవతలు నీళ్లు వొలకబోసినయట్లు / తల్లిచల్లని ప్రేమ వెల్లివారినయట్లు’ ఉందంటారు. 

జలదేవతల వెంట సాగిపోతున్న ‘కిన్నెరసాని’ నడక సొంపులు గురించి కవి వర్ణనలో ఆయన ప్రకృతి నిశితపరిశీలన గమనించవచ్చు. 


‘తెలితారకలవెంట వెలుగులా తోచింది / తలిరుపూవులవెంట తావిలాతోచింది / తెనుగుపాటల వెంట తీపిలా తోచింది’ అంటూ కిన్నెర నడకలను తారల వెంటగల వెలుతురుగాను, సుకుమారపూలకుగల సువాసనతోను తెలుగు పాటలోని మధురంతోను పోల్చి సహజసిద్ధైమెన విడదీయలేని పోలికలతో వర్ణిస్తూ పాఠకులకు విషయ అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ‘పాట కావ్యం’ అంతా అందైమెన ఉపవులతో తీర్చిదిద్దారు విశ్వనాథ.

కిన్నెర ప్రవాహపు నాద సౌందర్యం, గమన సౌందర్యం దృశ్యమానం చేయడంలో విశ్వనాథవారి ప్రతిభ పదాలకందనిది. వైుదానాల గుండా, అడవుల గుండా వివిధ కాలాల్లో ప్రాతఃకాలం మొదలు తిరిగి సాయంత్రం అయి తెల్లవారేవరకు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వివిధ ఋతువుల్లో వాగు ప్రవాహపు వైవిధ్యాన్ని ఈ పాటల్లో పట్టిచూపుతారు. 

ఇంత వర్ణించినా తనివితీరక ‘ఋతువు ఋతువునమారు రుచులలో కిన్నెరా / కారుకారున మారుకాంతిలో కిన్నెరా...’ అంటూనే కిన్నెర అపురూప అందాలు వర్ణించడానికి తనవద్ద పదాలు లేవని వినమ్రంగా చెబుతూ ‘తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని చవులూరి చవులూరి జలముల్లుప్రొవులై / కదిలేను కిన్నెరా / సాగేను కిన్నెరా!!...’ అంటారు విశ్వనాథ తన నిరాడంబరత ప్రకటిస్తూ.

అలనాడు కేవలం ఊహకన్యగా విశ్వనాథవారి మనోవేదికపై అవతరించిన ఆయన మానసపుత్రిక ‘కిన్నెరసాని’ కావ్యంలో అంతర్లీనంగా గల సామాజిక అంశం మాత్రం సార్వజనీనం, సతతకాల ఆవశ్యకం.

సంసార రథానికి భార్యాభర్తలిరువురు సమ ఉజ్జీలుగా నిలవాలని భిన్నభావాల్లో వుంటే కలిసి సంసారం సాగిం చడం సాధ్యపడదనే నిజాన్ని కిన్నెరసాని కావ్యంలో ఆవిష్కరిస్తూ భార్యాభర్తలో విడివిడిగా ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమాభిమానాలు వున్నా కష్టకాలంలో త్యాగభావం ప్రతిఘటనా శక్తులు ప్రదర్శించలేని సమయంలో ఆ ఇష్టాలన్నీ ‘రోగం నయం చేయలేని మందువలె’ నిష్ప్రయోజనంగా మిగిలిపోక తప్పదనే సత్యాన్ని చెబుతూనే స్త్రీలకు తమ అం దం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు నుండి పురుషుల వ్యా మోహపు చీడల నుండి చమత్కారంగా తప్పించుకునే లౌక్యాన్ని కవి ‘కిన్నెరసాని’ ద్వారా చెబుతారు.


కిన్నెరసాని ఒంటరిదై తనైదెన సహజహొయలు పొంగులతో వెళుతున్న సందర్భంలో సముద్రుడి పారవశ్యాన్ని గమనించి తన పాతివ్రత్యానికి కలగబోయే ప్రమాదాన్ని ఊహిం చి తన లౌక్యబుద్ధిని ప్రయోగించి సముద్రుని పడతి అయిన గోదావరిని అమ్మా అని పిలిచి ఆమె రక్షణపొంది ఆ గోదారమ్మ సాయంతో సముద్రుని తండ్రిని చేసుకుంది. మానవ సమాజంలోని వ్యక్తుల మధ్య చెడుభావనలు తొలిగి సహృదయ సౌభ్రాతృత్వం పెరగడానికి ‘వావివరుసలు’ ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది కిన్నెరసాని కావ్యం.

కాలమెంతమారినా కావ్యాలు సాహితీక్షేత్రంలో నిత్యనూతనంగా విరాజిల్లుతుంటాయి అనడానికి చక్కని ఉదాహరణ మన తెలుగింటి వన్నెల దొరసాని విశ్వనాథవారి మానస సుందరి కిన్నెరసాని. 


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!