Skip to main content
విశ్వనాథ -కావ్యానందం !
విశ్వనాథ -కావ్యానందం !
🏵️
విజయవాడ,ఏలూరు రోడ్డు,SRR కాలేజీ,.
ఆంజనేయస్వామి గుడి,కోకాకోలఫాక్టరి,
(ఇప్పుడులేదు),ఇటు చుట్టుగుంట
అటుగుణదల మేరీమాతగుడి.
జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత ఆకాలేజీకే పేరుతెచ్చారు .
🏵️
విశ్వనాధ మ్రోయుతుమ్మెద నవల కరీంనగరంలో
ఉన్నప్పుడు రాశారట!
అక్కడ ఎస్సారార్ కాలేజిలో ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు
మానేరు నది ప్రాంతానికి వాహ్యాళికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఒకసారి అక్కడి ప్రకృతి,ఏకాంతత,పక్షుల సంగీతం అన్నీ కలిసి ఆయనలో మెరిసిన మెరుపు మ్రోయుతుమ్మెద అయిందిట!
🏵️
అప్పటికి మానెయ్ర డామ్ లేదు.
కరీంనగరంలో నారాయణరావుగారని ఒక దేవీ ఉపాసకుడితో ఈయన మంచి స్నేహంగా ఉండేవారట.
కావ్యానందం వ్రాసినప్పుడు ఆఖరున స్వయంభువు అని ఒక ఛాప్టరులో ఒక వేదాంతితో ఆయన వాదం గురించి వ్రాశారు.
బహుశ ఆ వేదాంతి ఆయనే కావచ్చు.
వాదన విషయం జీవునిలో మరణం సంభవించే క్రమం.
(ఛాందోగ్యం ప్రకారం వాక్కు మనసును,మనసు ప్రాణమునందును,ప్రాణము తేజస్సునందును,తేజస్సు పరదేవతయందును పొందును)ఐతే ఈ క్రమం సామాన్యుడికీ,విద్వాంసుడికీ సమానమా కాదా అని చర్చ!
🏵️
కావ్యానందం సరాసరి జీవుడ్ణికదా చేరేది మీరు చెప్పేది!
ఆ జీవుడు ఎలాంటి జీవుడు?
అని చెప్పి ఆయనే అన్నాట్ట విజ్ఞానాత్ముడైన జీవుని పొందుతుంది నువ్వు చెప్పేదాని ప్రకారం. కాని వాడు జీవుడు కాదు. (ఎందుకంటేతాత్విక దర్శనం ప్రకారం జీవుడు అవిద్యా కర్మపూర్వోపజ్ఞుడు)అంచేతనువ్వు చెప్పేది పొసగదన్నాట్ట!
🏵️
ఐతే ఈయనేం తక్కువ తినలేదు. మాకు(కావ్యరసానందులకు) పొసగకపోతే యోగులకూ పొసగదు అన్నారు.
అని ఇంతకీ మాకు ప్రాణనిష్క్రమణతో పనిలేదు.
వాక్కు,ప్రాణం ఆ వరసలో ఒకదాన్నొకటి చెందుతున్నాయంటే అవి స్థబ్దం అవుతున్నాయేకాని పూర్తిగా నశించలేదు
ఆఖరున వాక్కు జీవుని పొంది బ్రహ్మానందంలాంటి కావ్యానందం పొందుతున్నామని ఈయన ముగించారు వాదన.
మాకు పొసగక పోతే యోగులకు కూడా పొసగదు అన్నమాట ఆలోచించాల్సిన విషయం.
🏵️🏵️🏵️🏵️
Comments
Post a Comment