Posts

❤️❤️❤️❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️❤️❤️❤️

Image
❤️❤️❤️❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️❤️❤️❤️ 🔻యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. 🚩ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు. 🔻గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. 🚩శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.. ❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻

🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

Image
🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450)) 🚩దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది. పేరుకు పెద్దన్న... 🚩కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచ...

💞 నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!💞

Image
💞 నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!💞 🔻'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.🔻 🚩 సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు వాలు చూపులు రెండు వేలు సేయు నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు విర్రవీగుట లారువేలు సేయు పదమొక్కటియె సేయు పదివేల వరహాలు లావణ్యమది యొక లక్ష సేయు బలుసోయగమె సేయు పది లక్షల వరాలు కులుకు నడక తీరు కోటి సేయు ❤️ ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!❤️

బారిష్టరుపార్వతీశం !!

Image
❤️ఇది చదివిన వాళ్లు ఎవరైనా వున్నారా... అపురూప గత జ్ఞాపకాలు ఇవి.💞 🚩95 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఇప్పుడు చదివినా నవ్వే వస్తుంది ఇష్టమైన పుస్తకము శ్రీ మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి గారికి నమస్సులు🔻🙏🏿🔻 లెఖ్ఖలేనన్నిసార్లు! తప్పక చదవవలసిన తెలుగు పుస్తకాలలో ఓకటి. 🔻రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి అత్తగారి ఊరు నర్సాపురం తాలూకా, గుమ్మలూరు అనే గ్రామం. ఇతను అక్కడికి వెళ్ళినపుడు తన బంధువుల కోసం ఒక పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, తమాషాలు సరదాగా చెప్పాడు. వాళ్ళు ఆనందించి దాన్ని ఓ కథలా రాయమన్నారు. అప్పటికి ఆయన రాసిన మూడు కథలు సాహితి, భారతి పత్రికలలో అచ్చయి ఉన్నాయి. అప్పటికి ఆయనకు దీన్ని ఓ రచనగా మలచాలనే సంకల్పం లేదు. కానీ శ్రోతలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుగా ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు, అక్కడ నుంచి మద్రాసు చేరినట్లు రాసి కుర్రవాళ్ళకు చదివి వినిపించాడు. వారు బాగుందనడంతో ఉత్సాహంతో కథానాయకుడు అక్కడి నుంచి బారిష్టరు చదువు కోసం ఇంగ్లండు ప్రయాణించడం వరకు రాయాలనుకున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు చదవడమంటే గొప్ప. అప్పటి దాకా పేరు పెట్టని పాత్రకు పార్వతీశం అని పేరు...

🚩విగ్రహారాధన–కారణం…

Image
🚩విగ్రహారాధన–కారణం… 🔻ఉపాసనలో విగ్రహారాధన ఐదవ వర్గంలోకి వస్తుంది. మనసు చంచలమైనది. ప్రతిక్షణం పరిభ్రవిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి మార్గం విగ్రహారాధన. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది. మనోధృతిర్ధారణా స్యాత్ సమాధిర్బ్రహ్మాణి స్థితిః| అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి విచింతయేత్|| జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో తన తల్లి, సోదరి, భార్య చిత్రపటాలు ఉన్నాయనుకుందాం. తల్లి చిత్రం చూడగానే అతనిలో ఆమె వాత్సల్యం; సోదరి చిత్రం చూడగానే స్నేహం, ఆర్ద్రత,భార్య చిత్రం చూడగానే ప్రణయభావం జాగృతం కావటం సహజం. ఏకలవ్యుడు ఏమి చేశాడు? ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు. ధ్రువుడు నా...

❤️🚩🔻🙏🏿ద్రౌపది!.🙏🏿🔻🚩❤️

Image
❤️🚩🔻🙏🏿ద్రౌపది!.🙏🏿🔻🚩❤️ 🚩 యగ్నసేని ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్తవయస్సుతో పుట్టింది. ఒక్కసారి ఊహించుకోండి.. చిన్నతనం లేకుండా.. ఒకేసారి యుక్తవయస్సులో పుట్టడం, వారసత్వ లక్షణాలు పొందడం అంటే చాలా ఆసక్తిగా ఉంది కదూ. పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. ఆ కాలంలో ద్రౌపది చాలా అందమైన మహిళ. 🚩 ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? 🚩 సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు ...

❤️యద్దనపూడి సులోచనారాణి .!

Image
❤️యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం . ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి. 🔻యద్దనపూడిసులోచనారాణి గురించి ఈ సంగతి తెలుసా !🔻 🚩నగరం నుంచే రచనా ప్రస్థానం రచనల్లో నగర వీధుల ఊసులు వృద్ధుల కోసం ‘విన్‌’ ఆశ్రమం❤️ హైదరాబాద్‌: తెలుగు నవలా ప్రపంచాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన సాహిత్య సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం నగరంలోనే ప్రారంభమైంది. 1957లో హైదరాబాద్‌వాసి నరసింహారావుతో వివాహానంతరం యద్దనపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామం నుంచి ఇక్కడి అత్తవారింట్లో అడుగుపెట్టారు. పల్లెటూరిలో పెరిగిన ఆమెకు తొలినాళ్లలో నగర జీవితానికి అలవాటవడానికి కొంత సమయం పట్టింది. అదే సమయంలో పుస్తకాలను ఆత్మీయనేస్తాలుగా మలుచుకొన్నారు. సాహిత్య పఠనంతోపాటు కథలు రాయడం తొలినాళ్లలో యద్దనపూడికి ప్రధాన వ్యాపకం. అప్పటి వ...