❤️యద్దనపూడి సులోచనారాణి .!


❤️యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.

ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో

తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం

. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి.

సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.


ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.


🔻యద్దనపూడిసులోచనారాణి గురించి ఈ సంగతి తెలుసా !🔻


🚩నగరం నుంచే రచనా ప్రస్థానం

రచనల్లో నగర వీధుల ఊసులు

వృద్ధుల కోసం ‘విన్‌’ ఆశ్రమం❤️


హైదరాబాద్‌: తెలుగు నవలా ప్రపంచాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన సాహిత్య సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం నగరంలోనే ప్రారంభమైంది.

1957లో హైదరాబాద్‌వాసి నరసింహారావుతో వివాహానంతరం యద్దనపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామం నుంచి ఇక్కడి అత్తవారింట్లో అడుగుపెట్టారు. పల్లెటూరిలో పెరిగిన ఆమెకు తొలినాళ్లలో నగర జీవితానికి అలవాటవడానికి కొంత సమయం పట్టింది.

అదే సమయంలో పుస్తకాలను ఆత్మీయనేస్తాలుగా మలుచుకొన్నారు. సాహిత్య పఠనంతోపాటు కథలు రాయడం తొలినాళ్లలో యద్దనపూడికి ప్రధాన వ్యాపకం.


అప్పటి వరకూ కథలు రాసే సులోచన ప్రఖ్యాత దర్శకుడు బాపు,

రచయిత రమణతోపాటు జ్యోతి పత్రిక వ్యవస్థాపకుడు రాఘవయ్య ప్రోత్సాహంతో నవలా రచన ప్రారంభించారు.

సులోచనా రాణి అన్ని నవలల్లో భాగ్యనగర వీధులుంటాయి.

ట్యాంక్‌బండ్‌ ఉంటుంది. పబ్లిక్‌గార్డెన్స్‌తోపాటు నగరంలోని ప్రముఖ పార్కుల్లో నాయకా, నాయకీల ప్రేమ ఊసులుంటాయి.

‘‘హైదరాబాద్‌ అందాల్ని, ట్యాంక్‌బండ్‌ సొగసును ముందుగా యద్దనపూడి సులోచనారాణి నవలలద్వారానే నాకు పరిచయం’’ అని

ఓ సందర్భంలో శాంతాబయోటెక్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌ రెడ్డి ప్రస్తావించారు.


🚩ఇంటి ముందు క్యూ...

మానవసంబంధాల్ని, స్త్రీ, పురుష అనుబంధం, మహిళల స్వాభిమానం వంటి అంశాల ఇతివృత్తంగా వినూత్నశైలిలో వచ్చిన యద్దనపూడి నవలలకు తెలుగు నాట నలుచెరల అశేషాభిమానులున్నారన్న సంగతి తెలిసిందే. మధ్యతరగతి అమ్మాయిల ఊహలు, అంతరంగానికి, ఆశలకు, స్వాభిమానానికి యద్దనపూడి నవలలు అద్దంపడతాయని నాటి పాఠకులు భావించేవారు. గృహిణుల్లోనూ పాఠకాశక్తిని పెంపొందించిన ఘనత ఆమెకే దక్కుతుందంటారు.

ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యద్దనపూడి నివాసం ముందు అనేక మంది అభిమానులు క్యూ కట్టేవారు. తమ అభిమాన రచయిత్రిని కలవాలని, మాట్లాడాలని దూరప్రాంతాల నుంచి గంటల తరబడి వేచివుండేవారు. కానీ, ఎవ్వరినీ కలవడానికి ఆమె ఇష్టపడేవారు కాదని యద్దనపూడి ఆప్తురాలు వాసా ప్రభావతి చెబుతున్నారు.


🚩సాహిత్య సంస్థలతో ...

గొప్ప రచయిత్రిగా పేరు, ప్రతిష్టలున్న యద్దనపూడి సులోచనారాణి పత్రికలు, టెలివిజన్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందుకు కారణం తనకు పెద్దగా మాట్లాడటం ఇష్టముండదని పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. తొలినాళ్ల నుంచి సభలు, సత్కారాలు, సన్మానాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. పదేళ్లుగా కొంతమంది సాహితీ వేత్తల కోరిక మేరకు కొన్ని అరుదైన సమావేశాలకు యద్దనపూడి హాజరయ్యారు. అంతేగాక నగరంలోని కొన్ని సాహితీ సంస్థలతో ఆమెకు అవినాభావ సంబంధముంది. రచయిత్రులను ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతో వాసా ప్రభావతి, మల్లాది సుబ్బమ్యతో కలిసి 2005లో యద్దనపూడి సులోచనారాణి ‘లేఖిని’ సాహిత్య సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల రచయిత్రుల సమావేశం నిర్వహించడంతోపాటు, రవీంద్రభారతి, త్యాగరాయగానసభ తదితర వేదికలపై ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. నగరంలోనే పురుడు పోసుకున్న నవల ‘సెక్రటరీ’ ఇదే నగరంలోని త్యాగరాయగాన సభ వేదికపై 50ఏళ్ల వేడుక జరుపుకోడం విశేషం. ‘రాగ సప్తస్వరం’ సంగీత, సాంస్కృతిక సంస్థకు యద్దనపూడి ముఖ్య సలహాదారుగా ఉన్నారు.


🚩మరో కోణం...

మానవ సంబంధాల ఇతివృత్తంగా, విభిన్న రచనాశైలితో పాఠకలోకం మనస్సును దోచిన నవలల రాణి సులోచనారాణిలో మరో కోణం దాగుంది. ఆమె వయస్సు మళ్లిన ఒంటరి మహిళల కోసం ‘విన్‌’ పేరుతో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆశ్రమాన్ని నిర్వహించారు కూడా. అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల తన ఆత్మీయులకు హోం బాధ్యతను అప్పగించారు. వీధిబాలలు, మురికివాడల్లోని పిల్లల కోసం తన ఇంటి ఆవరణలోనే కొద్దిరోజుల పాటు ప్రత్యేక పాఠశాలను నిర్వహించారు. ‘పరాశర’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ బాలల వసతిగృహాలు, వయోధికుల ఆశ్రమాలకు బియ్యం, పప్పు వంటి సరుకులతోపాటు ఆర్థిక సహాయం అందిస్తుంటారని వాసా ప్రభావతి చెబుతున్నారు. సెక్రటరీ 50ఏళ్ల వేడుకలో పది మంది విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించారు. ‘వయస్సు మీరిన తర్వాత మనకంటూ మనం ఓ వ్యాపకాన్ని పెట్టుకోవాలి’ అని యద్దనపూడి సులోచనా రాణి తరచుగా అంటుండేవారని ఆమె ఆత్మీయులు చెబుతున్నారు.


🚩ఇష్టమైన ‘మే’ నెలలోనే...

చాలామందికి మండే ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉండే మే నెల అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ, తనకు మాత్రం ‘మే’ నెల చాలా ఇష్టమని యద్దనపూడి సులోచనారాణి ఓ సందర్భంలో చెప్పారు. ఈ నెలే ఎందుకు ఇష్టమంటే ‘ఏడాదంతా ఎదురుచూసే మామిడిపండ్లు, మల్లెపూలు ఇప్పుడే వస్తాయి కనుక’ అని ఆమె సమాధానమిచ్చారు. అంతేగాక ఇదే నెలలో తన తొలి నవల ‘సెక్రటరీ’ రచన సీరియల్‌గా పాఠకలోకానికి పరిచయమైంది. ఇదే నెలలో తన ముద్దుల కుమార్తె శైలజ పుట్టింది. దాంతోపాటు తనకు అత్యంత ఇష్టమైన అమ్మమ్మ కూడా ఇదే నెలలో దూరమైంది అని యద్దనపూడి ఓ సందర్భంలో చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన మే నెలలోనే ఆమె కన్నుమూయడం యాధృశ్చికం..🙏🏿


(మీనా ,జీవన తరంగాలు,సెక్రటరీ,రాధాకృష్ణ

,అగ్నిపూలు,చండీప్రియ.,ప్రేమలేఖలు

బంగారు కలలు.విచిత్రబంధం,జై జవాన్, ఆత్మ గౌరవం.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!