🌷🏵️🌷-మహానటి- సావిత్రి .🌷🏵️🌷

🌷🏵️🌷-మహానటి- సావిత్రి .🌷🏵️🌷


👉చందమామ ఏలా అందరి సోంతమో ; సావిత్రీ ప్రతీ వారికీ

సోంతమే . మన అందరికీ ఆవిడ తో ఆ అనుబంధం విడదీయనిది .


ఆవకాయ ; గోంగూర ఏలా అయితే ప్రతీవారికీ ముఖ్యంగా మన


తేలూగూవారికి సోంతమో--_ ఇష్టమో ;


సావిత్రి కూడా మనఅందరకీ ఇష్టం మన ఇంటి బిడ్డ.


మనకి ఇష్టమైన విషయము మీద ఏలాగ మనం బంధం--


అనుబంధం ఏర్పరుచుకుంటామో; ఏలా దానిని మనకే సంబంధించిన మన విషయం అని నిర్వచించుకుంటామో; అనువయించుకుంటామో అలాగే సావిత్రి తో మన అనుబంధం . అది విడదీయరానిది


అసలు ఓక సావిత్రీ తోనేనా??


జమున ; భానుమతి; అంజలి; కన్నాంబ ; రేలంగి; సూర్యకాంతం;


షావుకారు జానకి ; కృష్ణకుమారి ;


నాగయ్య ; యేస్వీ రంగారావు; csr ఆంజనేయులు ; జగ్గయ్య ; కాంతారావు ; ఛాయాదేవి ; రామారావు; రాజనాల ; నాగేశ్వరరావు; రమణారేడ్డి ; గిరిజ ; చలం; నాగభూషణం ; అల్లూ రామలింగయ్య ; పద్మనాభం ; రాజబాబు ; శారద ; గీతాంజలి ; రమాప్రభ;

హేమలత (ఈ కేరక్టర artiste ఇంకా hyderabad లో ఉన్నారు 92 years. అత్తలు కోడళ్ళు సినీమా లో సూర్యాకాంతానికి అత్తగారు ;

లేదా కాంచన రాజశ్రీ నాగేశ్వరరావు ల ఆత్మగౌరవం సినీమా చూసినట్టు అయితే అందులో నాగేష్వరరావు అమ్మా కాంచన అమ్మమ్మ గా వేసిన ఆవిడ )

సత్యన్నారాయణ; రావుగోపాలరావు ; గుమ్మడి s.వరలక్ష్మి జీ. వరలక్ష్మి ; నిర్మలమ్మ ; ఋష్యేoద్రమణి ;

ఇలా ఏందరో మహానుభావులు ఆతరం లో అందరితో మనం మమేకమై పోయాము.


వీళ్లగురించి డేబ్భై దశకం ముందువరకూ పుట్టిన ప్రతీ తేలుగు చలన చిత్ర ప్రేమికులకు కాస్తో కూస్తో తేలుసు .

వీళ్ళంతా నటకోవకు చేందిన వారే . అలాగే తేరవేనుక ఏందరో.


భోజనము చేయ్యడానికి ఏలా పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇష్ట పడుతామో అలా వీళ్ళoతా మనకి ఇష్టం . వీళ్ళల్లో ఏవ్వరూ ఏక్కువ తక్కువ కాదు .


గోంగూర -చింతకాయ- ఆవకాయ -కోబ్బరి పచ్చడి- టమేట ఊరగాయ- ఇలా అన్నీ మన ముందు కంచం లో ఉంటే అన్నీ తినేయాలి అనిపిస్తుంది . దేని విశిష్టత దానిదే కదా . ఏది లేదన్నా ఏదో కోరత .అలాగే వీరందరూ హేమాహేమీలు.


వీరందరికీ ఓక కథ ఉండుంటుంది. అందరి కధలలో ఓక బాధ సంతోషం ఉండే ఉంటుంది . ups and downs .


అయితే పూలు అమ్మిన చోట కట్టేలు అమ్మినట్టు గా

సావిత్రి ; నాగయ్య గారు ఇద్దరూ విధి వంచితులు .

దారుణం గా జనాన్ని(స్నేహితులు ; ఆప్తులు ; బంధువులు ) నమ్మి మోసపోయారు .


నలభై ఐదు పైబడిన ప్రతీ వారికీ ముఖ్యంగా సీనీప్రేమీకుల కు

వీరి జీవితం అందులో అంశాలు కోట్టిన పిండి.


ముఖ్యంగా మన సావిత్రి విధి వంచిత. జేమీనీ గణేశనుని చేత మోసపోయిన వంచితురాలు.


అసలు ఆవిడ విషాదకధ; ఆవిడ పడ్డ బాధలు మనకు తేలుసు. వాటినన్నిటినీ ఆవిడ దిగమింగుకుని మనలని తన వైవిధ్య భరిత నటన తో మురిపించీ ఆ మహోన్నతమైన నటనను మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆనందపడుతున్నాము.


ఏవో మరుగున పడిన జ్ఞాపకాలు ఆవిడ ఆర్ధికంగా చితికిపోయి చిన్న చిన్న వేషాలు వేయ్యడము బాగా గుర్తుకు వచ్చి హృదయాన్ని కలిచివేసింది.


అసలు ఆవిడ ఆఖరుఆఖరున నాగభూషణం తో రావి కోండలరావుతో గోకిన రామారావు తో pair గా చూడలేకపోయిన వాళ్లం. అసలు గోరింటాకు సినీమా లో రమణ మూర్తి ని తన్ని తగలేయ్యాలని బాధపడ్డాము .


మన సావిత్రి కధ మనకు తేలుసు ఆవిడకి సంబంధించిన అనేక విషయాలు చదివాము ; ఇతరులు చేప్పగా తేలుసుకున్నాము విన్నాము .


ఏందుకో ఏమో మహానటి సావిత్రి జీవితం పెద్ద విషాదం .


!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!