❤️"మనః ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః "❤️

❤️"మనః ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః "❤️


మనస్సే మనుషుల బంధ మోక్షములకు మూల కారణం కదా !


1. ఓమ్‌ మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ

అశుద్ధం కామసంకల్ప౦ శుద్ధం కామ వివర్జితం ||


“మనస్సు” అనేటు వంటిది రెండు విధాలుగా వున్నది. ఎవరికైనా సరే అందరిలో కూడా. ఒక విధముగా వున్న మనస్సు పేరు ‘శుద్ధము’ – అంటే పవిత్రము. దాంట్లో ‘శుభము’ వుంటుంది. శుభవాసనలు వుంటాయి. రెండవ విధమైనటువంటిది ‘అశుద్ధము’ – అంటే మాలిన్యమైనది. దాంట్లో అశుభ వాసనలు వుంటాయని, అపవిత్రము వంటిదని చెప్తున్నాడు. ‘శుభము’- అంటే ఏమిటి? ‘పవిత్రము’- అంటే ఏమిటి? ‘అశుభం’ – అంటే ఏమిటి? అంటే రెండవ చరణములో “అశుద్ధం కామసంకల్పం, శుద్ధం కామవివర్జితం” – అని తేల్చేశాడు.


అశుద్ధము అంటే కోరికలతోటి, కోరికలు ఎలా వుంటాయి? స్వార్థమును ఆశ్రయించి వుంటాయి. స్వార్థమును ఆశ్రయించేటి కోరికలన్నీ, స్వార్థాన్ని తృప్తిపరిచేట్టుగా వుంటాయి. దాన్ని కామసంకల్పం అంటారు. అటువంటి కోరికల్ని, అటువంటి స్వార్థాన్ని దానికి సంబంధించకుండా వుండేటువంటిది ‘శుద్ధం’ – అన్నాడు. అదెట్లాగో నిర్వచించలేము, ‘కామవివర్జితమ్‌’ – ఇటువంటి కోరికలు లేకుండా వుండేటువంటి మనస్సు.


2. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః

బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతమ్ ||


మీ అందరికీ తెలిసిన శ్లోకమేగా ఇది. మొదటిపాదం చెప్పుకుంటూ వుంటారు అందరూ కూడా. “మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” – తరువాత శ్లోకంలో వుంది దాని రహస్యం, ఇదేమో ప్రతిపాదించినటువంటి నిర్ణయము. ఎలాగ? అనేది రెండవపాదంలో చెప్పారన్నమాట. “విషయాసక్తతో వుండటమే బంధము, ‘నిర్విషయం మనః’ అయితే ముక్తి”.


నువ్వు మనస్సుతో కూడివున్నావు. అది కూడా ఎటువంటి మనసు?

వికసించిన మనసుతో కూడుకుని వున్నవాడవు.

పరిపక్వమైనటువంటి మనసుతో కూడికునియున్న వాడవు.


ఇప్పుడా మనసును, ఆ పరిపక్వతను ఎటు వాడుకోవాలట? వికాసాన్ని?


‘ముక్తి’ వైపు వాడుకోవాలి. ‘ముక్తి’ లక్ష్యంలో వాడుకోవాలి. ‘బంధ’ లక్ష్యంలో కాదు.


విషయాసక్తం అవ్వడమే బంధము. నిర్విషయముగా వుండడమే ముక్తి.


మన నిత్యజీవితంలో ఏ ఆలోచనైనా రానివ్వండి, ఈ ఆలోచన వల్ల నాకు బంధం పెరుగుతుందా? తగ్గుతుందా? బంధం పెరుగుతుందనుకోండి – వదులుకోవడమే.

((అర్థమైందా? అండీ!)) అది.


Comments

  1. ఓం నమః శివాయ.
    👌👌👌✌✌✌💐💐💐💐💐💐🏵🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!