🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹

🌹🌹🌹🌹దొందూదొందే - సామెతకథ 🌹🌹🌹🌹

——————————//———————————

అనగనగా ఒక ఊరు. 

ఆ ఊళ్ళో ఒక నత్తి వాడుండేవాడు.

అతన్ని అందరూ ఎగతాళి చేసేవారు. 

నత్తి కారణంగా అతనికి పెళ్ళి కాకుండా వుంది. 

చివరికి అతని తల్లితండ్రులు చాలా దూరంలో వున్న 

ఒక ఊరిలో అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో తమ అబ్బాయికి పెళ్ళి చేశారు. పెళ్ళి జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. సిగ్గుపడుతున్నారని అందరూ అనుకున్నారు.

🌈 

పెళ్ళి తంతు అంతా పూర్తి అయిన తర్వాత అబ్బాయినీ,

అమ్మాయినీ పల్లకీలో ఎక్కించి అబ్బాయి ఊరికి పంపించారు.

దారిలో వారికి పూచిన చింతచెట్ల వరస కనిపించింది.


👉నత్తివాడు సంతోషం పట్టలేక “ తింతలు తూతాయి”


(చింతలు పూశాయి )అన్నాడట.


👉అది విని అమ్మాయి “ తూతే తెట్టు తుయ్యదా తాతే తెట్టు తాయదా “ 

(పూసే చెట్టు పుయ్యదా , కాసే చెట్టు కాయదా ) అన్నదట.


👉వారి వెనక వస్తున్నపురోహితుడు “ దొందూ దొందే “ 

(రెండూ రెండే) అని అన్నాడట.


ఆ ముగ్గురు నత్తివాళ్ళను చూసి పల్లకీ బోయీలు నవ్వుకున్నారట.....


అలాఅలా దొందూ దొందే అనే సామెత వాడుక లోనికి వచ్చింది........


🌹🌹🌹🌹🌹————🌹🌹🌹——-🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!