గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:-
గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:- (Anappindi Suryalakshmi Kameswara Rao) ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో 1926లో జన్మించిన వరలక్ష్మి తన పదకొండవ ఏటనే నాటకల్లో నటించాలన్న ఉత్సాహంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయారు. ఆ రోజుల్లో తుంగల చలపతి, దాసరి కోటిరత్నం ఇద్దరూ ప్రసిద్ధ రంగస్థల నటులు. ''రంగూన్ రౌడీ, సక్కుబాయి'' చిత్రాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న సందర్భం అది. వారి ప్రభావం జి. వరలక్ష్మి మీద పడింది. తన పన్నెండవ ఏటనే బారిస్టరు పార్వతీశం, బొండాం పెళ్లి చిత్రాల్లో నటించారు. హెచ్.ఎమ్.రెడ్డి, రఘుపతి ప్రకాశ్ ఈమెను ప్రోత్సహించారు. అప్పట్లో నౌషద్ గారి పాటలంటే పడిచచ్చేవాళ్ళు. జి. వరలక్ష్మి 'నౌషద్' ట్రూపులో చేరి పాటలు పాడేసి గొప్ప గాయనీమణి అయిపోవాలన్న కలలు కనేది. అనుకున్నదే తడవుగా బొంబాయి వెళ్ళిపోయింది. అతి చిన్న వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశం... పైగా తప్పొప్పులు చేప్పేవాళ్ళు ఎవరూ లేరు. తన మనసులో మెదిలే ఏ పనైనా దూకుడుగా చేసెయ్యడం... ఎదురు దెబ్బ తగిలితే రాటుదేలడం... ఇదే నేర్చుకుంది. అయితే దేవుడిచ్చిన గొప్పవరం తె...