Posts

గాలి వాన ఘోషిస్తున్నది.

Image
ఉషశ్రీ గారి కవిత.. గాలి చెడుగుడు ఆడుతున్నది. వాన చిందులు తొక్కుతున్నది. సముద్రం రోదిస్తున్నది. గాలి ఈలలు వేస్తున్నది. సముద్రం ఘోషించడం ఆరంభించింది. వాన ముదిరి కుండపోత పోస్తున్నది. గాలి పెరిగి చేటలతో విసరింది. సముద్రం పొంగి లంకల మీదికి వస్తున్నది. వాన విసురుతున్నది. గాలి కురుస్తున్నది. గాలి వాన ఘోషిస్తున్నది.

ఉపసేచనం (అల్పాహారం).

Image
Courtesy.Vvs Sarma గారు.... . సృష్టి అంతా ఎప్పటికప్పుడు మృత్యువు నోట పడుతూనే ఉంటుంది. అది మృత్యువుకు ఉపసేచనం (అల్పాహారం). తమస్సు సత్త్వరజములను వెన్నంటి ఉంటూ సృష్టిని లయంచేస్తుంది. బ్రహ్మజ్ఞాని ఇలాఅనుకుంటాడు - ఉన్నట్లు కనబడే సృష్టిని అలాంటి మృత్యువే కబళిస్తూంది. అందుచేత జ్ఞాని త్రిగుణములచేత బాధింపబడడు.

శ్రీలు పొంగిన జీవగడ్డ....రాయప్రోలు సుబ్బారావు గారు..

Image
రాయప్రోలు సుబ్బారావు గారు.. శ్రీలు పొంగిన జీవగడ్డయు శ్రీ లు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా! వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యంబలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదుసమ్మిది చెల్లెలా! విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు వొలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా! పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణ కధ పండగల చిక్కని తెలున్గుల కలిపి పాడవె చెల్లెలా! దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా! లోకమంతకు కాక పట్టిన కాకతీయుల కదన పాండితి చీకిపోవని చేవ పదములు చేర్చి పాడవె చెల్లెలా!.......

ఆకాశంలో ఆశల హరివిల్లూ..

స్వర్ణకమలం విరిసి పాతికేళ్ళు అయినా సందర్బంగా ...ఈ పాట విందాం... ఆ..ఆ..ఆఆఆ..ఆ ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా.. ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా.. వయ్యారివాన జల్లైదిగిరానా.. సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా.. సందెల్లో రంగులెన్నో చిలికేనా.. పిల్లగాలే పల్లకీగా..దిక్కులన్నీ చుట్టీ రానా.. నా కోసం.. నవరాగాలే..నాట్యమాడెనుగా.. ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలూరే సోయగానా..చందమామా మందిరానా.. నా కోసం..సురభోగాలే..వేచి నిలిచెనుగా... ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా.. ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ http://www.youtube.com/watch?v=R_5sk6MJNDQ

Lord Balaji....

Image
వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా వేంకటరమణా గోవిందా By: Brahmasri Chaganti Koteswara Rao Garu.

గంగకి త్రిపథగ అన్న నామం...

Image
శ్రీ రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.

ఘంటసాల గారి అత్త లేని కోడలు ఉత్తమురాలు తెచ్చిన తంటా..

ఘంటసాల గారి అత్త లేని కోడలు ఉత్తమురాలు తెచ్చిన తంటా.. ఒక మహానుభావుడు నేను ఉత్తమరాలను కాను, మీరు గుణవంతు రాలు కారు అంటో పడుతున్నాడు అత్తగారు ఎందుకంటా అమ్మా..... మీరు బ్రతికి ఉన్నారు కదా...